‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపిన అల్లు అర్జున్, ‘జవాన్’తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇటీవలే దర్శకుడు అట్లీ హైదరాబాద్‌కి చేరుకుని, అల్లు అర్జున్‌తో షూటింగ్ షెడ్యూల్లు, లుక్ టెస్టులు, సెట్ డిజైన్లపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైటిల్‌పై హాట్ టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఐకాన్’, ‘సూపర్‌హీరో’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మొదట దర్శకుడు వేణు శ్రీరామ్ కోసం ‘ఐకాన్’ టైటిల్ నమోదు చేసినా, ఆ ప్రాజెక్ట్ మొదలవలేదు. ఇప్పుడు అదే టైటిల్‌ను అట్లీ చిత్రం కోసం వాడాలన్న ఆలోచనలో బన్నీ ఉన్నారని సమాచారం. అట్లీ కూడా ఈ టైటిల్‌పై పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఐకాన్’ టైటిల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ప్రతి సినిమాకు ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపించే అల్లు అర్జున్, ఈ సినిమాలో మరింత విభిన్నమైన గెటప్పుల్లో దర్శనమివ్వనున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా పునర్జన్మం నేపథ్యంలో ముడిపడి ఉన్న సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది.
ఈ కాన్సెప్ట్‌కు తగినట్టుగా, ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించేందుకు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ VFX కంపెనీ ఇప్పటికే ప్రాజెక్టులో చేరిందట.