కొద్దిరోజుల క్రితం ‘థగ్ లైఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య… ఇప్పుడు తమిళనాడు-కర్ణాటక మధ్య పెద్ద చిచ్చే రేపింది. పలువురు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.

ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ప్రజలు, ఫిలింలవర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. “కమల్ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే దగ్ లైఫ్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తాం!” అని. అప్పటికి కమల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ, “నేను చెప్పిన మాటలు ప్రేమతో చెప్పినవే. చాలా మంది చరిత్రకారులు నాకు భాషా చరిత్రను బోధించారు. నా ఉద్దేశం ఎవరినీ అగౌరవపరచాలని కాదు” అని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ఎంతో విశాల దృక్పథం కలిగినదని, తమిళనాడులో కేవలం తమిళులే కాకుండా ఇతర భాషా నేపథ్యాలున్నవారు కూడా అత్యున్నత పదవులు అలంకరించారని ఆయన గుర్తుచేశారు.

“తమిళనాడులో ఒక మీనన్ (మలయాళీ) మన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక తమిళుడు మన ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ఒక కన్నడిగ అయ్యంగార్ కూడా మన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు” అని కమల్ హాసన్ వివరించారు.

“భాష అనేది సున్నితమైన అంశం. దాని గురించి మాట్లాడేందుకు రాజకీయ నాయకులు అర్హులు కారు. నిజం చెప్పాలంటే, ఆ అర్హత నాకు కూడా లేదు” అని ఆయన అన్నారు. భాషా సంబంధిత విషయాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసర వివాదాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ, ఇకపై ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఆయన పరోక్షంగా సూచించారు.

అయితే అక్కడితో కూడా వివాదం ఆగేలే లేదు. ఇంతవరకూ ఇది ఇండస్ట్రీ డిమాండ్‌గానే ఉండగా… రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా కమల్ కామెంట్స్‌ను తప్పుబట్టడమే సంచలనం. అంటే ఇప్పుడు కమల్‌కి దారులన్నీ మూసుకుపోయినట్టే.

కానీ… ఈ మాటలు కన్నడ వాదుల కోపాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడు ఒక్కటే డిమాండ్ – క్షమాపణ ఇవ్వాలి!

కర్ణాటక ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత సా.రా. గోవిందు మీడియాతో మాట్లాడుతూ, ‘కమల్ హాసన్ మొండిగా బిహేవ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకుండా ఇక్కడ సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తాం. పంపిణీదారులు మాకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. కమల్ పై ఎలాంటి జాలి లేదు’ అని అన్నారు.

కమల్ హాసన్ క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేరు. దీంతో థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు తక్కువ. కర్ణాటకలో సినిమా రిలీజ్ కాకపోతే కమల్ కి 20 కోట్ల వరకు నష్టం రావచ్చు అని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో కమల్ హాసన్ కూడా ఒకరు.

వివాదం వల్ల OTT డీల్స్ డిలే అవ్వొచ్చు, లేదా రెడ్యూస్ కావొచ్చు

డబ్బింగ్ మార్కెట్ల (హిందీ, తెలుగు) మీద కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది – నెగెటివ్ పబ్లిసిటీ వల్ల

ఇంత గొడవ అనంతరం… ‘సారీ’ అనే రెండు అక్షరాలతో ఈ కథ ముగిసిపోతుందా? లేక ఇంకా ఎలాంటి ట్విస్ట్‌ వుంటుందా?

జూన్ 5 – ‘థగ్ లైఫ్’ విడుదల కాబోతోంది.
అంటే… క్లైమాక్స్ టైం దగ్గరపడుతోంది. కమల్ ఎలాంటి ముగింపు ఇస్తాడో చూడాలి!

, , ,
You may also like
Latest Posts from