జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘ఆయ్’. అయితే అతని మొదటి సినిమా మాత్రం ఇంతకాలం రిలీజ్ కాలేదు. ఆ చిత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగి బయిటకు వస్తోంది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్‪‌తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు.

తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి ‘రాజావారు’ మూవీ ఏం చేస్తుందో చూడాలి?

#Kamal Hassan, #Narne Nithiin, #Sri Sri Sri Rajavaru, #Thug Life

By admin