పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరి హర వీరమల్లు’ – ఈ పేరే ప్రస్తుతం తెలుగు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్! అయిదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఫైనల్ కట్ దశలో ఉంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినీ స్క్రీన్ మీదికి వస్తున్న తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో అసాధారణమైన హైప్ నెలకొంది.
వీరమల్లు క్రేజ్ @ పీక్స్
ఇది పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా కొత్త జోనర్ — మొఘల్ యుగాన్ని నేపథ్యంగా తీసుకుని, ఓ దొంగగా పవన్ కనిపించబోతుండటంతో సినిమా గ్లిమ్స్‌తో నే ఆసక్తిని రేపింది.
2020లోనే మొదలైన షూటింగ్, కోవిడ్ విఘ్నాల మధ్య సాగుతూ ఇప్పటికీ పూర్తి కావడం, నిర్మాత A.M. రత్నం ఈ చిత్రంపై పెట్టిన ప్యాషన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకంగా మారింది.
బిజినెస్ ఈక్వేషన్:
నైజాం రైట్స్‌కు రూ.60 కోట్లు కోట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఇదంతా ఒకే ఒక్క ఏరియా రేటే అని చెప్పుకుంటే, తూర్పుగోదావరి, విశాఖపట్నం లాంటి ఏరియాల్లో కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది.
తూ.గో రైట్స్ – ₹13 కోట్లు
వైజాగ్ – భారీ రేంజ్లో ఉండే టాక్
ఇటువంటి రేట్లు చూసి బయ్యర్లలో మొదలైంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఉన్నా, ఈ స్థాయి బిజినెస్ జరగాలంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉండాల్సిందే.
నిర్మాత లెక్కలు వేరే కథ
A.M. రత్నం ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. షూటింగ్ ఆలస్యం, వడ్డీలు పెరగడం వంటివి కలిపి, కాస్ట్ ఆఫ్ ప్రోడక్షన్ భారీగా మారింది.
ఆయన లాజిక్ సింపుల్: ఈ రేట్లకే అమ్మితేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. పవన్ పాపులారిటీని నమ్ముకున్న కొందరు బయ్యర్లు ముందుకు వస్తున్నా, క్లారిటీ లేని సానుకూలత తో కూడిన ఆందోళన ఉంది.
ట్రైలర్.. టైమింగ్ గేమ్
ట్రైలర్‌ను జూన్ 5 లేదా 6న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్ బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదిస్తే, డీల్స్ వేగంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడి రెస్పాన్స్ ఈ సినిమా క్రేజ్‌ను సెటిల్ చేస్తుందా లేదా అన్నది టెస్ట్ చేయనుంది.
‘హరి హర వీరమల్లు’ ఒక మ్యాగ్నమ్ ఓపస్ మాత్రమే కాదు… పవన్ కళ్యాణ్ రాజకీయ పవర్ + స్టార్ ఇమేజ్ కలబోసిన పెద్ద సినిమా. కానీ బయ్యర్లకు అది కల కూడా కావచ్చు, ఖర్చు బాగా పెరిగితే సాహస యాత్ర కూడా కావచ్చు. ట్రైలర్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు డిసైసివ్ పాయింట్!