పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ కోసం యూఎస్‌లో ఫ్యాన్స్ కూడా భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్-ఇండియన్ స్థాయిలో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. అమెరికా ప్రీ-సేల్స్ ప్రారంభమై హల్చల్ అయినప్పటికీ, ఇప్పటి వరకు అంచనాలకు తగ్గట్లుగా పెద్ద బూస్ట్ రాలేదు. టీజర్ విడుదల దగ్గరగా ఉన్నందున ఈ సినిమా క్రేజ్ త్వరలో మరింత పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. యూఎస్‌లో ప్రీ-బుకింగ్స్ కూడా కొన్ని రోజులు క్రితం ప్రారంభమయ్యాయి. తాజాగా ‘హరి హర వీరమల్లు’ యూఎస్ ప్రీ-సేల్స్ అధికారిక రిపోర్ట్ విడుదలైంది.
యూఎస్ ప్రీమియర్స్ కోసం ఇప్పటి వరకు గ్లోబల్‌గా $135,000+ లు ప్రీ-సేల్స్ నమోదు అయ్యాయి. పూర్తి బుకింగ్స్ జూన్ 4న ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ప్రీ-సేల్స్ పరిస్థితి సగటు స్థాయిలో ఉందని తెలుస్తోంది. అయితే, ఇతర పాన్-ఇండియన్ భారీ సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ.
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ యూఎస్ ప్రీ-సేల్స్ లో భారీ గ్రోత్ అవసరం. ఇప్పటి దాకా ట్రెండ్ చాలా స్థిరంగా ఉంది. జూన్ 5 లేదా 6 తేదీలకు టీజర్ విడుదల అవ్వబోతుండటంతో, అది సినిమా పట్ల హైప్ పెంచే కీలక మైలురాయిగా నిలవనుంది.
తాజాగా, ఈ చిత్రానికి యూఎస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యత వహిస్తున్న ‘Prathyangira Cinemas’ ప్రీ-సేల్స్ వివరాలు లీక్ చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక నోటీసు జారీ చేసింది.