“సంక్రాంతి అంటే తెలుగు సినిమా సంబరం!”

ప్రతి ఏడాది సంక్రాంతి వ‌చ్చిందంటే… థియేట‌ర్స్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఏ హీరో సినిమా వచ్చిందా? ఎంత కలెక్ట్ చేస్తుందా? ఎవరి ఫస్ట్ డే ఫస్ట్ షోకు అభిమానులు ఎన్ని బానర్లు కడతారు? అన్నదానికంటే పెద్ద హైప్ ఇంకేదీ ఉండదు. సంక్రాంతి రిలీజ్ అంటే కేవలం రిలీజ్ కాదు — అది ఓ వార్‌లా మారిపోయింది! కొందరికి కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది, మరికొందరికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌కే బూస్ట్ అవుతుంది.
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చాడు!. తాజాగా ఆయన కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈసారి స్టైలిష్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.

SLV సినిమాస్ – సుధాకర్ చెరుకూరి బ్యానర్‌పై గ్రాండ్ గా

ఈ చిత్రాన్ని నిర్మించేది SLV Cinemas సంస్థ. 2024 జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేకర్స్ ఇప్పటికే ఒక సంక్రాంతి 2026 రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు – అంటే మాస్ ఫెస్టివల్‌కు మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు!

అనార్కలి టైటిల్ పక్కా అవుతుందా?

హీరోయిన్లుగా ఆషికా రంగనాథ్ మరియు కేతికా శర్మ లు ఎంపికయ్యారు. ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు కానీ… మేకర్స్ “అనార్కలి” అనే టైటిల్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇది అధికారికంగా త్వరలోనే రివీల్ కానుంది.

మరొకవైపు ‘మాస్ జాతర’కి రెడీ అవుతున్న రవితేజ

రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మాస్ జాతర” చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 27, 2025న విడుదల కానుంది.

రవితేజ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ట్రీట్ టైమ్!

ఒక్క పక్క మాస్ జాతర‌తో రేపే అదరగొట్టే మూవీ వస్తుంటే, ఇంకొక పక్క సంక్రాంతి 2026కి మరో బ్లాక్‌బస్టర్ టార్గెట్ చేస్తూ SLV Cinemas లైన్‌లో పెట్టిన ఈ ప్రాజెక్ట్… విన్నవెంటనే బజ్ పుట్టిస్తోంది.

సంక్రాంతి రేసులో కొత్త స్పార్క్‌కి సిద్ధమవండి — మాస్ మహారాజా ఫ్యామిలీస్ కు ఆహ్వానం పలకబోతున్నాడు!

, ,
You may also like
Latest Posts from