స్టార్ హీరోయిన్ త్రిష — ఒకవైపు కొత్త హీరోతోనూ, మరోవైపు సీనియర్‌ లెజెండ్స్‌తోనూ సమంగా స్క్రీన్ షేర్ చేస్తూ దూసుకెళ్తున్న టాప్‌ హీరోయిన్. ఆచితూచి సినిమాలు ఒప్పుకునే ఆమె వయస్సు పెరుగుతున్నా గ్లామర్ తగ్గకపోవటంతో వరస సినిమాలు చేస్తోంది. ఆమె తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. అందులో చేసిన పాత్ర ఇంద్రాణి గురించి ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది.

“వేశ్య పాత్రా? ఆమె పాత్రకీ కథకీ సంబంధముందా?”

తెరపై ఇంద్రాణి పాత్రను చూస్తుంటే, త్రిషను కేవలం గ్లామర్ కోసం వినియోగించుకున్నారని సినీప్రేక్షకుల అభిప్రాయం. “ఒకవైపు సీనియర్ నటి, అటు ప్రతిష్టాత్మక సినిమా… అయితే పాత్ర ఎందుకింత ఘోరంగా ఉంది?” అని ప్రశ్నిస్తున్నారు.

ఇక రొమాన్స్ అంశంలో – 70ఏళ్ల కమల్ – 42ఏళ్ల త్రిష మధ్య కెమిస్ట్రీ సెట్టయినట్లే లేదు అని కొందరంటున్నారు. ట్రైలర్‌లోనే విమర్శలు మొదలై… సినిమాలో పూర్తిస్థాయి సీన్లు మాయమైన తర్వాత ఇవి మరింత పెరిగాయి.

త్రిష పాత్ర తొలగింపుపై పెరుగుతున్న అనుమానాలు

తమిళ సినీ వర్గాల ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం, త్రిష పాత్రకి ప్రారంభంలో ఎక్కువ స్క్రీన్ టైం, డార్క్ పాస్ట్, సంగీతాన్ని ఆశ్రయించే ఎమోషనల్ షేడ్స్ ఉన్నాయట. కానీ విడుదలైన ఫైనల్ వెర్షన్‌లో వాటన్నిటిని కట్ చేశారట. అదే ఇప్పుడు స్క్రీన్ బయట చర్చల వేదికగా మారింది.

విమర్శల్లో నిజం ఏంటి?

త్రిష పాత్రను చిన్నచూపు చూశారా? లేక కథా గమనం దృష్టిలో పెట్టుకుని ఆ సన్నివేశాలను తీసేశారా? అన్నది మణిరత్నం, కమల్ హాసన్ చెప్పాల్సిన విషయం. కానీ అభిమానులు మాత్రం ఒకటే అంటున్నారు. “ఒక గ్లామర్ షాట్‌కి కాదు, ఓ కథకి న్యాయం చేసే పాత్రకే త్రిష లాంటి నటి కావాలి, అంతేకాని అర్దంపర్దం లేని ఇలాంటి పాత్రలు కాదు” అనే మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

, , ,
You may also like
Latest Posts from