బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆర్.ఎస్ ప్రసన్న రూపొందిస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం దీని తెలుగు ట్రైలర్ విడుదల చేసింది. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొంతమందిని ప్లేయర్స్‌గా తీర్చిదిద్దే కోచ్ పాత్రలో ఆమిర్ కనిపించారు.
ఈ ట్రైలర్ ను బట్టి ఒక హృద్యమైన, భావోద్వేగభరితమైన స్పోర్ట్స్ డ్రామాగా సినిమా ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, జెనీలియా దేశ్‌ముఖ్, డాలీ అహ్లువాలియా, గుర్ పాల్ సింగ్, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్లో ఆమిర్ ఖాన్.. గుల్షన్ అనే సమస్యలతో సతమతమయ్యే, కోపిష్టి వ్యక్తిగా కనిపిస్తారు. చట్టంతో కొన్ని చిక్కుల్లో పడటంతో, మానసిక వికలాంగులైన యువకులతో కూడిన ఒక బాస్కెట్‌బాల్ జట్టుకు కోచ్‌గా పనిచేయాల్సిన పరిస్థితి అతనికి ఎదురవుతుంది.
ట్రైలర్లో చూపిన దాని ప్రకారం గుల్షన్ మొదట్లో ఆ యువకులను పాగల్ (పిచ్చివాళ్లు) అంటూ చులకనగా మాట్లాడతాడు. వారి పట్ల ఎలాంటి సానుభూతి, అవగాహన లేని వ్యక్తిగా ప్రవర్తిస్తాడు. అయితే, కథనం ముందుకు సాగే కొద్దీ గుల్షన్ ప్రవర్తనలో మార్పు వస్తుందని ట్రైలర్ సూచిస్తోంది.