సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ… చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిద్వారా ఇతరులను గమనించడం, కామెంట్లపై స్పందించడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని ఎవ్వరూ బయటకు చెప్పరు.
కానీ… అల్లు అరవింద్ మాత్రం వేరే లెవెల్! ఓపెనెస్‌తో “నాకొక ఫేక్ ఐడి ఉంది, అందరినీ ఫాలో అవుతుంటా” అంటూ తెగేసి చెప్పేశారు.

ప్రియదర్శి – నిహారిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మిత్రమండలి’ టీజర్ లాంచ్ ఈ వ్యాఖ్యలకు వేదికైంది. తన స్టైల్లో సాదాసీదాగా చెప్పినప్పటికీ, ఈ కామెంట్ అక్కడున్న అందర్నీ నవ్వులు పూయించేలా చేసింది.

‘‘నిన్ను కూడా ఫాలో అవుతుంటా… నీకు మంచి భవిష్యత్తు ఉంది’’

అల్లు అరవింద్ ఈ మాటలు నిహారికకు చెప్పగా, ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.‘‘సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు ఓపెన్‌గా చూడలేం. అందుకే అకౌంట్ ఓపెన్ చేశా. అందరినీ గమనిస్తుంటా’’ అంటూ తన సీక్రెట్ ని ఓపెన్ గా షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంలో బన్నీ వాస్ కూడా తన అభిమానం బయటపెట్టారు. “అరవింద్ గారి వల్లే ఈ స్థాయికి వచ్చాం. ఆయన ఇంట్లోనే ఎక్కువగా ఉన్నా. నా జీవితంలో లవ్ ఎలిమెంట్ మిస్ అయ్యిందంటే, బన్నీ & అరవింద్ గారే కారణం” అని సరదాగా చెప్పారు.

మిత్రమండలి – యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్

‘జాతి రత్నాలు’ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుని నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. సత్య, వెన్నెల కిషోర్ కాంబో, యువ దర్శకుల ప్రయత్నం, నిహారిక ప్రెజెన్స్ – అన్నీ కలసి ఈ చిత్రంపై మంచి అంచనాలు పెంచాయి.

ఫేక్ ఐడీ చెప్పినా, నిజాయితీ చూపించిన అరవింద్ గారికి థమ్సప్ ! మిత్రమండలి టీజర్ చూస్తుంటే, ఇది కాస్త సెన్సిబుల్ కామెడీ అనే ఆశ చెప్పకమానదు!

#Allu Aravind, #Mithra Mandali, #Niharika Nm, #Prasad Behara, #Priyadarshi

By admin