పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు ఇప్పటికైనా థియేటర్స్‌కి రావడానికి సిద్ధమవుతున్నాడు. బహుశా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మీద ఇన్ని ఏళ్లు హైప్ నిలబడడం నిజంగానే అరుదైన విషయం! ఎన్ని వాయిదాలొచ్చినా, ఈ సినిమాపై క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం… హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్ విడుదల తేదీని ఎట్టకేలకు ఫిక్స్ చేశారు.

ఫిక్స్ అయిన న్యూ రిలీజ్ డేట్ – జూలై 18

మేకర్స్ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం, జూలై 18న హరి హర వీరమల్లు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఆ డేట్‌కు ప్రస్తుతం ఏ పెద్ద సినిమా రిలీజ్ ప్లాన్ చేయలేదు కాబట్టి, సోలో రిలీజ్ అనే అడ్వాంటేజ్ ఈ సినిమాకు ఉండబోతోంది. దీని వలన బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఖచ్చితంగా బాగుంటాయని అంచనా.

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ – ఆగస్ట్ 1కు షెడ్యూల్

ఈ డేట్ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్డమ్” ఆగస్ట్ 1న విడుదల కానుండటంతో హరి హర వీరమల్లుకు రెండు వారాల క్లియర్ విండో లభిస్తుంది. ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

ఈసారి వాయిదా అంటే 2026కి వెళ్లే అవకాశం

ఒక్క జూలై 18న రిలీజ్ కాకపోతే… ఈ సినిమాకు వచ్చే అవకాశం 2026 లోకే వెళ్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ OG రిలీజ్ కానుంది. రెండు సినిమాల మద్య గ్యాప్ లేకపోవడంతో, వాయిదా పడితే మళ్లీ రిలీజ్ డేట్ వెతకడం చాలా కష్టమవుతుంది.

మేకర్స్ పై ఒత్తిడి – ఈసారి తప్పక రిలీజ్ చేయాల్సిందే

ఏఎం రత్నం సారథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్… ఇప్పుడు నిఖార్సైన నిర్ణయం తీసుకొని జూలై 18న ఖచ్చితంగా విడుదలవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో మళ్లీ మరొకసారి ఇబ్బంది వస్తే… అభిమానులలో అసహనం తారాస్థాయికి చేరుతుంది.

#Bobby Deol, #Hari Hara Veeramallu, #Krish, #Nidhi Agarwal, #Pawan Kalyan

By admin