బాలయ్య అంటే మాస్. అఖండ అంటే అగ్రెషన్. ఇప్పుడు ఈ రెండూ కలిసొస్తే? అందుకే “అఖండ 2” టీజర్ రిలీజ్‌తో నే దేశవ్యాప్తంగా అఖండ హంగామా స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో టీజర్ దూసుకెళ్తుంటే, సోషల్ మీడియాలో సిటీల్లో పెట్టిన హోర్డింగులు, ప్లెక్సులు వైరల్ అవుతున్నాయి. ఇంత హంగామా జరుగుతుంటే బిజినెస్ ఆగుతుందా

OTT రైట్స్ – “Buy the hype before the crowd does!”

టీజర్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై బజ్ పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో బాలయ్య జోరు చూస్తుంటే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అదిరిపోతూ బిజినెస్ డీల్స్ కోసం చూశాయి. ట్రేడ్ సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమాస్‌, డిస్నీ హాట్‌స్టార్‌ లాంటి దిగ్గజాల్ని వెనక్కి నెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు రూ.80 కోట్లు చెల్లించి డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్టు వార్త.

ఈ సినిమా బడ్జెట్ రూ.150-200 కోట్లు అని తెలుస్తోంది. అంటే ఓటీటీ రైట్స్ ద్వారా ఇప్పటికే దాదాపు 40-50% రికవరీ సాధించిందన్న మాట!

నేషనల్ లెవెల్ ప్రమోషన్స్ – “From Rayalaseema to Rajasthan!”

బాలకృష్ణ కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ. అందుకే, నార్త్ ఇండియాలో టీజర్‌తోనే ఇంట్రెస్ట్ మొదలైంది. మేకర్స్ ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి ముందు బహుశా బాలయ్య స్టైల్ లోనే ప్రమోషన్లు Nationwide గా జరగనున్నాయ్.

బాలయ్య బోయపాటి మాస్ కాంబో రీటర్న్స్!

‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ – మాస్ ఆడియన్స్‌కి హై వోల్టేజ్ ఎమోషన్, యాక్షన్ ఇచ్చిన ఈ మాస్ కాంబో మళ్ళీ రెడీ. ఈసారి బిజినెస్ పరంగానూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మేనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ మాంత్రికుడు తమన్ మరోసారి డప్పులతో స్కోర్ రెడీ చేస్తున్నాడు.

క్రూ డిటేల్స్:

సినిమాటోగ్రఫీ: సి రాంప్రసాద్, సంతోష్

ఎడిటింగ్: తమ్మిరాజు

బ్యానర్: 14 రీల్స్ ప్లస్

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

ఏదైమైనా “With content that connects, commerce follows.”

#Aadhi Pinisetty, #Akandha 2, #Amazon Prime Video, #Boyapati Srinu, #Nandamuri Bala Krishna

By admin