బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రస్తుతం వివాదాల వలయంలో చిక్కుకుంది. సినిమా రిలీజ్‌కు కేవలం వారం రోజులే ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్‌ ఆలస్యం సినిమా ఫేట్‌పై ప్రశ్నార్ధక చిహ్నం వేసింది.

రెండు కట్స్ – గట్టి అభ్యంతరం!

సినిమాను చూసిన CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్), రెండు కీలక సన్నివేశాలను తొలగించాలని సూచించిందట. కానీ ఆ కట్స్‌ సినిమా అసలైన ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయని ఆమీర్ ఖాన్ అభిప్రాయం.

“ఈ చిత్రం కథాపరంగా ఎంతో సున్నితమైనది. ఎడిటింగ్ ద్వారా తాత్కాలికంగా సమస్య పరిష్కరించినా, భావాన్ని తుంచేస్తారు,” అని ఆయన అంటున్నట్టు సమాచారం.

ఇప్పటికీ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ లేకుండానే ఉంది. అందువల్ల, థియేటర్లు కూడా అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్‌లను ప్రారంభించలేని పరిస్థితి.

జూన్ 16న కీలక సమావేశం

ఈ నేపధ్యంలో, ఆమీర్ ఖాన్ సోమవారం (జూన్ 16) CBFC ఎగ్జామినింగ్ కమిటీని మరోసారి కలవనున్నాడు. అక్కడే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. పాజిటివ్ స్పందన వస్తే, దీంతో టికెట్ బుకింగ్స్, ప్రమోషన్స్ అన్నీ రీఛార్జ్ అవుతాయి.

యూకేలో సర్టిఫికేట్, ఇండియాలో ఓటమా?

ఇంటర్నేషనల్‌గా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. బ్రిటన్‌లో BBFC (British Board of Film Classification) ఇప్పటికే సినిమాకు 12A సర్టిఫికేట్ ఇచ్చింది.

సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు. BBFC పేర్కొనడంవల్ల సినిమాలో “డిస్క్రిమినేషన్, మితమైన సెక్స్ సూచనలు” ఉన్నట్టు తెలుస్తోంది.

స్క్రీన్ కౌంట్ పెంపుతో భారీ రిలీజ్

తొలుత లిమిటెడ్ రిలీజ్ ప్లాన్ చేసినా, బజ్ పెరగడంతో ఇప్పుడా నిర్ణయం మారింది. ఇప్పుడు ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా 3000 – 3500 స్క్రీన్‌లలో విడుదల కానుంది.

ఇంకో విశేషం ఏమిటంటే – ఈ సినిమాను OTTకి ఇప్పటివరకు అమ్మలేదు. థియేటర్లలో ఓపెనింగ్‌కే ఫోకస్ పెట్టిన ఆమీర్, ఇది డిజిటల్ యుగంలో ఓ ‘రిస్కీ స్టెప్’గా విశ్లేషిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

బిజినెస్ కోణంలో…
సెన్సార్ డీలే వల్ల థియేటర్లలో బుకింగ్‌లకు బ్రేక్

ప్రమోషన్లపై నెగటివ్ ప్రభావం

OTT డీల్స్ లేకపోవడం వల్ల థియేటర్ ఓపెనింగ్స్‌పై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి

CBFC గ్రీన్ సిగ్నల్ వస్తేనే సెకండ్ గేర్‌కు మారే అవకాశం

మొత్తానికి, ఆమీర్ ఖాన్‌ ఈ సినిమాతో మళ్లీ తన సెన్సిటివ్‌ ఎమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ సెన్సార్ బ్రేక్ క్లియర్ కాకపోతే, ఈ సినిమా రీలీజ్ డేట్ ఇంకా ప్రశ్నార్థకమే!

చూడాలి… జూన్ 16 ఫలితం ఎటు దారితీస్తుందో!

, ,
You may also like
Latest Posts from