‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయానంతరం దర్శకుడు సుకుమార్ చిన్న విరామం తీసుకున్నారు. తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. పలు కథల ఆలోచనలను పరిశీలించిన ఆయన, రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు కమిట్ అయ్యారు. అయితే రామ్ చరణ్ ఇప్పటివరకు ఆ కథ లేదా ఐడియా వినలేదు. వరుసగా పని చేసిన సుకుమార్, కుటుంబంతో సమయం గడుపుతూ, కొత్త కథపై నెమ్మదిగా పనిచేయాలని భావిస్తున్నారు.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సుకుమార్ చివరికి ‘రంగస్థలం 2’ ఐడియాపైనే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ను రాసుకుంటూ ఉన్నారు. త్వరలోనే ఫస్ట్ డ్రాఫ్ట్‌ను రామ్ చరణ్‌కి వినిపించనున్నారు. ‘రంగస్థలం’ భారీ విజయం సాధించగా, రామ్ చరణ్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ క్లాసిక్‌కి సీక్వెల్ చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఆరంభ దశలోనే ఉంది. సుకుమార్, ఆయన టీమ్ త్వరలో దుబాయ్ వెళ్లి స్క్రిప్ట్‌ను పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది దసరా తర్వాత కథా వినిపించడం జరిగే అవకాశముంది