ఐదు వారాల నిశ్శబ్దం తర్వాత, హీరోయిన్ హన్సిక మోత్వానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ ఇచ్చింది. విడాకుల రూమర్స్ రచ్చ రచ్చ చేస్తున్న టైమ్‌లో, తన బాలీ వెకేషన్ పిక్స్ షేర్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది.
2022లో జైపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న హన్సిక–సోహైల్ జంట, డిసెంబర్ 2024లో రెండో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా హన్సిక సోషల్ మీడియాలో మాయమవ్వడంతో రూమర్స్ ఊపందుకున్నాయి.
ఇప్పుడు మాత్రం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ తన “హ్యాపీ సైడ్” చూపించింది. దీంతో ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్ మొదలయ్యాయి –
నిజంగానే మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ లేదా ఇవన్నీ కేవలం రూమర్సేనా?
హన్సిక రీ ఎంట్రీతో అసలు క్లారిటీ వచ్చిందా లేక ఇంకా పెద్ద ట్విస్ట్ బయిటకు రావాల్సి ఉందా?
ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ ఫాలోవర్లతో హన్సిక మళ్లీ యాక్టివ్ కావడం, “దీన్ని మించిపోయే రివీల్ ఇంకా వస్తుందేమో” అనే కుతూహలం పెంచేస్తోంది.