కొలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌కు ఇప్పుడు “డూ ఆర్ డై” పరిస్థితి. తెలుగు, హిందీ మార్కెట్‌లో సత్తా చాటిన ఆయనకు గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘స్పైడర్’, ‘దర్బార్’, ‘సికందర్’ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్ అవడంతో ఆయన క్రేజ్ గణనీయంగా పడిపోయింది.

ఇప్పుడయితే శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘మదరాసి’ మురుగదాస్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అవబోతోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో బిజీ అవుతారు. కానీ మరోసారి ఫెయిల్ అయితే, ఆయన కెరీర్‌కే ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాకి రుక్మిణీ వసంత్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు చూడాలి… ‘మదరాసి’ మురుగదాస్‌కు మేకోవర్ ఇస్తుందా? లేక మర్చి పోయేలా చేస్తుందా?

, , ,
You may also like
Latest Posts from