

బరేలీలోని (ఉత్తరప్రదేశ్) నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ (Khushboo Patani) వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని స్వస్థలం బరేలీలో (ఉత్తర ప్రదేశ్) ఆమె ఇంటి దగ్గర గురువారం అర్ధరాత్రి ఘోర పరిణామం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి సమీపంలో తుపాకీలతో కాల్పులు జరిపారు.
ఈ ఘటన వెనుక రోహిత్ గోడారా, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కి చెందిన ఫ్యాక్షన్ చేతులున్నాయని అనుమానం వ్యక్తమవుతోంది. ఇంకా షాకింగ్ ఏంటంటే… వీరేంద్ర చారణ్ అనే గ్యాంగ్ మెంబర్ ఫేస్‌బుక్‌లోనే దాడికి తామే కారణమని ఓపెన్‌గా రాసేశాడు. దిశా పటాని సనాతన ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ… ఈ కాల్పులు అసలు ట్రైలర్ మాత్రమే అని హెచ్చరించాడు.
ఇకపోతే, దిశా పటాని ముంబైలోనే ఎక్కువగా ఉంటూ కెరీర్ కొనసాగిస్తోంది. గత ఏడాది ఆమె ప్రభాస్‌తో కలిసి “కల్కి 2898 AD” లో కనిపించారు.
ఈ కాల్పులపై దిశా తండ్రి జగదీశ్ పటాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్థానిక పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.
హీరోయిన్ ఇంటి దగ్గర ఇలా జరగడంతో ఈ వార్త టాలీవుడ్–బాలీవుడ్లో హల్చల్ అవుతోంది? అసలు ఈ “ట్రైలర్ వార్నింగ్” వెనుక అసలు మిస్టరీ ఏంటి?