

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ ఫోటోలు, పేర్లు, వాయిస్‌లను తమ ఫర్మిషన్ లేకుండా ఈ-కామర్స్ సైట్ల ద్వారా వాడేస్తూండటంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు వారు నేరుగా కోర్ట్‌ను ఆశ్రయిస్తూ తమ గోప్యత, హక్కుల రక్షణ కోరుతున్నారు.
ఇప్పటికే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత గోప్యత కోసం హైకోర్టును ఆశ్రయించి విజ్ఞప్తి చేసారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కూడా చేరారు.
తాజాగా కరణ్ జోహార్, తన వ్యక్తిగత సమాచారాన్ని తప్పుదారి పట్టకుండా, ఫోటోలను, వాయిస్‌ను అనధికారికంగా వాడకూడదని, వీటిని టీ-షర్ట్‌లపై లేదా ఇతర ఈ-కామర్స్ ప్రోడక్ట్స్‌లో ముద్రించకూడదని హైకోర్టులో పిటిషన్ వేసారు.
సెప్టెంబర్ 15న, కరణ్ జోహార్ తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడుకోవాలని, ఎవరూ తన ఫోటో, పేరు, గొంతును అనధికారికంగా ఉపయోగించరని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ మన్మీత్ పిఎస్ ఆరోరా ముందు విచారణకు వచ్చింది. కోర్టు కరణ్ జోహార్ తరఫు న్యాయవాది నుండి వివరాలు కోరుతూ, తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తూ నిర్ణయించింది.
కరణ్ జోహార్ మాట్లాడుతూ:
“నా వ్యక్తిత్వాన్ని, ముఖాన్ని, గొంతును ఎవరు అనధికారికంగా ఉపయోగించరాదు. దయచేసి నా వ్యక్తిగత హక్కులకు భద్రత కల్పించండి” అన్నారు.
తదుపరి విచారణలో కరణ్ జోహార్ కు ఎలాంటి ఫలితం రాబడుతుందో ఇప్పుడు చూడాలి.