

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న అనేక వరస చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ అభిమానులకి ఫీస్ట్ సినిమాగా తాను తెరకెక్కిస్తుండగా ఇపుడు షూటింగ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే పవన్ ఈ సినిమా షూటింగ్ ని ఈ వారంలోనే ముగించేస్తారని చెప్పారు.
ఇక ఈ ఏడాదిలోనే హరి హర వీర మల్లు రిలీజ్ చేసి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, సెప్టెంబర్ 25న OG తో బాక్సాఫీస్ దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జోష్‌లో ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పవర్ స్టార్ పూర్తిచేశారు. మిగిలిన కొన్ని సీన్స్ మాత్రం ఆయన లేకుండానే వచ్చే రెండు వారాల్లో కంప్లీట్ అవుతున్నాయి.
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మాస్ పోలీస్ డ్రామా, తమిళ సూపర్ హిట్ థేరి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో డిజిటల్ డీల్ ఫైనలైజ్ చేయడానికి మేకర్స్ టాక్స్ ఫైనల్ స్టేజీకి చేరుకున్నాయి.
డిసెంబర్ రిలీజ్ అనుకున్నా… కొన్ని కారణాల వలన అది కాస్తా కుదరదనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఫ్రెష్‌గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే – మహా శివరాత్రి లాంగ్ వీకెండ్‌లో ఫిబ్రవరి 13న సినిమా రిలీజ్ ఫిక్స్ అవుతుందా?
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరపైకి తెస్తున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫిబ్రవరి 13 – పవర్‌స్టార్ థియేటర్స్ లో దిగే రోజా?” అనే క్యూరియాసిటీ మాస్ ఆడియెన్స్‌లో పెరిగిపోతోంది!