రాజమౌళి – ప్రభాస్ లెజెండరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి: ది ఎపిక్’ అమెరికాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఏ రీ-రిలీజ్ అయినా లైఫ్‌టైమ్‌లో 150K డాలర్లు వసూలు చేయలేదు. కానీ ఈ మహాకావ్యం మాత్రం ప్రిమియర్ అడ్వాన్స్ సేల్స్‌తోనే ఆ ఫిగర్ దాటేసింది!

ఇంతకుముందు రీ-రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్ ‘ఖలేజా’ దే – సుమారు 120K. కానీ ‘బాహుబలి’ ఆ రికార్డుని సింపుల్‌గా చెరిపేసి 150K దాటేసింది. ఇంకా సినిమా రిలీజ్‌కు 10 రోజులు బాకీ ఉంది అంటే హంగామా ఎక్కడికి దారితీస్తుందో ఊహించండి!

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, సినిమా ఫుల్ రన్‌లో కనీసం మిలియన్ మార్క్ టచ్ చేసే అవకాశం ఉంది. మరీ అభిమానుల క్రేజ్ చూస్తుంటే అది కూడా స్మాల్ మైల్స్‌టోన్‌లా మారొచ్చు. అమెరికాలో ఈ రీ-రిలీజ్‌కు ఉన్న బజ్ ఇప్పటి టైర్-2 హీరో సినిమా రిలీజ్ లెవెల్‌లో ఉంది.

భారతదేశంలో కూడా బాహుబలి రీ-రిలీజ్‌కి అదే స్థాయి హంగామా లేదా దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. బాహుబలి మరోసారి బాక్సాఫీస్ బాటలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి సిద్ధమైంది!

“రీ-రిలీజ్ కూడా రికార్డులు బద్దలు కొడుతుంటే… అసలు బాహుబలి ప్రభావం ఎప్పటికీ తగ్గదేమో!”

, , , , ,
You may also like
Latest Posts from