మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి.

ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్ రేంజ్‌లో చాలా ముందుండేవారు. తరువాత బాలయ్య “అఖండ”తో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇద్దరి సినిమాల బిజినెస్ మళ్లీ సరిసమానంగా ఉంది.

‘మన శంకర వ‌ర ప్రసాద్ గారు’ అనే చిరంజీవి సినిమా, ‘అఖండ 2’ అనే బాలయ్య సినిమా — అన్ని ఏరియాల్లో చూస్తే చిరంజీవి సినిమాకి క్లియర్ లీడ్ ఉంది. కానీ సీడెడ్ మాత్రం బాలయ్య ఖిల్లా! అక్కడ మాత్రం పోటీ టఫ్‌గా ఉంది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రెండు సినిమాల సీడెడ్ బిజినెస్ రేటు 24–25 కోట్ల మధ్య ఉండగా, ఫైనల్ డీల్ 22 కోట్ల వద్ద క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ లెక్కలు చూస్తే —

చిరంజీవి సినిమా: ₹160 కోట్లు దాటే అవకాశాలు
బాలయ్య సినిమా: తెలుగు వెర్షన్‌కు సుమారు ₹125 కోట్లు

ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య చర్చ ఒకటే —
“సీడెడ్ సింహాసనం ఎవరిదీ? చిరు దా… లేక బాలయ్యదా?”

, , , , ,
You may also like
Latest Posts from