
‘ది ప్యారడైజ్’టీమ్‌కి వార్నింగ్ ఇచ్చిన హీరో నాని?!
‘దసరా’తో సూపర్ హిట్ అందుకున్న నాని, అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జట్టుకట్టిన ప్రాజెక్ట్ — ‘ది ప్యారడైజ్’. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతోంది. రియల్ సతీశ్ నేతృత్వంలో నిర్మితమవుతున్న యాక్షన్ ఎపిసోడ్‌లో విదేశీ యాక్షన్ ఎక్స్‌పర్ట్స్ కూడా పాల్గొంటున్నారు.
అయితే, షూటింగ్‌లో జరుగుతున్న జాప్యం నానిని తీవ్రంగా ఆలోచనలో పడేసిందట. పర్ఫెక్షన్ మాన్‌గా పేరున్న శ్రీకాంత్ ఓదెలా ప్రతీ సన్నివేశాన్ని నిపుణంగా తీర్చిదిద్దుతుండటంతో షెడ్యూల్‌లు లేట్ అవుతున్నాయి. దీనిపై నాని స్వయంగా రంగంలోకి దిగి, దర్శకుడికి “మార్చి చివరి లోపల షూట్ పూర్తి కావాలి!” అంటూ క్లియర్ డెడ్‌లైన్ ఇచ్చేశాడట.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం — మొదట ప్రకటించిన మార్చి 26, 2026 విడుదల తేదీని చేరుకోవడం ఇక కష్టమని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మేకర్స్ జూన్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నారట. నాని తన తదుపరి కమిట్‌మెంట్స్ దృష్ట్యా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి లోపు పూర్తి కావాలని నిర్మాతలకు కూడా స్ట్రిక్ట్‌గా చెప్పినట్టు సమాచారం.
విలక్షణ నటుడు మోహన్ బాబు (Mohanbabu) కీలక పాత్ర పోషిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ వచ్చే యేడాది మార్చి 27న ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లోనూ విడుదల కానుంది. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, సంగీతం అనిరుధ్ రవిచందర్.
