సినిమా వార్తలు

“నా కర్వ్స్ నా ఐడెంటిటీ!” – ట్రోల్స్‌పై తమన్నా ఫైర్!

సీనియర్ హీరోయిన్లలో ఒక్కతిగా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉంది. గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్‌తో కొత్తగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. అయితే ఇటీవల ఆమె హఠాత్తుగా సన్నబడిన తీరు చూసి, సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి — “తమన్నా కూడా Ozempic వాడిందట!” అని ట్రోల్స్ వర్షం కురిపించారు.

దీనిపై తమన్నా తానే ఓ క్లియర్ రిప్లై ఇచ్చింది —

“నా బాడీ నాకు కొత్తది కాదు. నేను ఇరవై ఏళ్ల వయసు నుంచే కెమెరా ముందు ఉన్నాను. నాకు తినడం అంటే ఇష్టం, కానీ డైట్ కంట్రోల్ చేయడం కష్టం. నా కర్వ్స్ ఎక్కడికీ పోవు… ఇదే నా బోన్ స్ట్రక్చర్. ప్రతి మహిళా జీవితంలో బాడీ మార్పులు సహజం. వాటిని అంగీకరించాలి” అని బదులిచ్చింది.

ట్రోల్స్ కి కౌంటర్ ఇస్తూ తమన్నా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి! “Ozempic కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే నీ సీక్రెట్!” అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Similar Posts