సినిమా వార్తలుసోషల్ మీడియా

బాలయ్యపై ఎమోజీ వివాదం…చివరికి క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్!

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఒక చిన్న ఎమోజి వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య అభిమానులు ఆగ్రహంతో మండిపడటంతో, ఆయన ఎట్టకేలకు స్పందించారు.

అసలు వివాదం ఏంటంటే… గత నెలలో టాలీవుడ్ అగ్రతారలతో పైరసీ నివారణపై సీవీ ఆనంద్ సమావేశం నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ హాజరైన ఈ మీటింగ్‌లో బాలయ్య లేకపోవడంపై ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.

ఆ కామెంట్‌కు సీవీ ఆనంద్ ఎక్స్ ఖాతా నుంచి నవ్వుతున్న ఎమోజి రిప్లై వచ్చింది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీవీ ఆనంద్ క్లారిఫికేషన్

“దాదాపు రెండు నెలల క్రితం పెట్టిన ఒక ఎమోజి కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. అది నా సోషల్ మీడియా హ్యాండ్లర్ చేసిన పొరపాటు. నాకు తెలియదు.”

“వెంటనే ఆ పోస్ట్ తొలగించాను. బాలయ్య గారికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసి క్షమాపణ చెప్పాను.”

“బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగాను. వారందరిపై నాకు గౌరవం ఉంది.”

“ఇప్పటికే ఆ హ్యాండ్లర్‌ను తొలగించాను. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించండి.”

ఒక చిన్న ఎమోజి వల్ల పెద్ద వివాదం… సీనియర్ ఐపీఎస్ అధికారి క్షమాపణ చెప్పాల్సి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Similar Posts