సినిమా వార్తలు

అంబానీ, అదానీ లెవెల్‌లో నయనతార కి బర్త్ డే గిప్ట్, వైరల్ న్యూస్ !

హీరోయిన్ నయనతార నిన్న (నవంబర్ 18) 41వ పుట్టిన రోజు స్టైలిష్‌గా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి బర్త్‌డే స్పెషల్‌ని నిజంగా లగ్జరీ లెవెల్‌నే మార్చేసింది ఒక గిఫ్ట్!

అవును… ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ సర్ప్రైజ్‌గా నయనకు ఇచ్చింది అక్షరాలా 11 కోట్ల విలువైన Rolls-Royce Black Badge Spectre!

ఈ ఫోటోని ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట ఒక్కసారిగా చర్చ మొదలైంది.

ఈ కారున్న భారతీయ సినీ పరిశ్రమలో తొలి హీరోయిన్… నయనతారనే!

సౌత్‌లో ఈ కారు రామ్ చరణ్ దగ్గరే ఉంది. దేశంలో అయితే ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి బిలియనీర్‌ బిజినెస్ మేగ్నేట్స్ మాత్రమే దీనిని కొనగలిగారు. ఇక ఫిల్మ్‌స్టార్స్‌లో నయనతార, రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ మాత్రమే వీరి లిస్ట్‌లో ఉన్న సెలెబ్రిటీలు.

తర్వాత నయనతార లేటెస్ట్ ఫిల్మ్స్ విషయానికి వస్తే..

ఇప్పుడు ఆమె తెలుగులో
— చిరంజీవి సరసన “మన శంకర వర ప్రసాద్ గారు”
— బాలకృష్ణ కొత్త చిత్రం (#NBK111) లలో నటిస్తోంది.

11 కోట్ల గిఫ్ట్‌తో నయనతార మరోసారి ఎందుకు ట్రెండ్‌లో ఉందో ఇపుడు అర్థమైంది కదా!

Similar Posts