సినిమా వార్తలు

‘వారణాసి’ ‌లో హనుమంతుడు ఎవరు? రాజమౌళి టీమ్ గేమ్ ఏమిటి?

వారణాసి సినిమా మీద ఉన్న హైప్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఒక్క చిన్న అప్డేట్‌కే సోషల్ మీడియా షేక్… ఫస్ట్ గ్లింప్స్ తర్వాత అయితే ఈ సినిమా స్టేటస్ స్ట్రెయిట్‌గా మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిల్మ్! రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు కాదు… పది రెట్లు.

ఈ భారీ క్రేజ్ మధ్య ఇప్పుడు ఒక కొత్త బాంబ్ లీకైంది!

హనుమంతుడు ఎవరు? వారణాసి టీమ్ దాచిన మిస్టరీ బయట పడుతున్నదా?

కొన్ని నెలలుగా ఆర్. మాధవన్ వారణాసి లో కీలక రోల్ చేస్తున్నారని బజ్ వస్తూనే ఉంది. కాని ఆశ్చర్యమేమిటంటే—టీమ్ ఇప్పటివరకు ఒక్క అధికారిక స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇటీవల విడుదలైన అప్‌డేట్‌ల్లో కూడా ఆయన పేరు మిస్ కావడంతో… “ఏదో పెద్ద సర్ప్రైజ్ దాచుతున్నారు” అనే వాదనలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి.

తాజా టాక్ ఏమంటోంది అంటే—

ఆర్. మాధవనే సినిమాలో లార్డ్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని బలమైన ఇండస్ట్రీ బజ్! గ్లింప్స్‌లో హనుమంతుడి షాట్ చూపించిన తరుణం నుంచి, ఆ పాత్రను ఎవరు చేస్తున్నారు అన్నది నేషనల్ లెవెల్ డిబేట్ అయిపోయింది.

టీమ్ మాత్రం ఈ రివీల్‌ను ‘రైట్ టైమ్’ వరకూ హోల్డ్‌లో పెట్టిందట. మాధవన్ ఇంకా సెట్స్‌లో జాయిన్ కాలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో షూట్‌లో చేరే చాన్స్ ఉన్నట్టు సమాచారం.

వారణాసి స్టార్ లైన్-అప్

మహేష్ బాబు – లార్డ్ రామ

ప్రియాంక చోప్రా – లీడ్

పృథ్విరాజ్ సుకుమారన్ – కీలక పాత్ర

ఆర్. మాధవన్ – లార్డ్ హనుమంతుడా? (అఫీషియల్ సస్పెన్స్ కంటిన్యూ…)

2027 రిలీజ్ టార్గెట్‌తో ముందుకు వెళ్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 చివరికి పూర్తవుతుంది.

వారణాసి: యాక్షన్ + డెవోషన్ = రాజమౌళి స్కేల్ మ్యాజిక్

రాజమౌళి విజన్‌లో డెవోషనల్ యాక్షన్ డ్రామా అంటే ఏ రేంజ్ ఉంటుందో అభిమానులు ఊహించేసుకున్నారు. అందుకే ఒక్కో రూమర్ కూడా ఇప్పుడు మిలియన్ వ్యూస్ స్దాయిలో ఉంది.

Similar Posts