సినిమా వార్తలు

ప్రభాస్‌ ఇమేజ్‌ని ఎవరు పాడు చేస్తున్నారు?

ఇండియన్ సినిమా లో స్పీక్‌లెస్‌గా కూడా స్టార్ అయిపోవచ్చు అని నిరూపించిన అరుదైన పేరు ప్రభాస్. బాక్సాఫీస్ దగ్గర దంచికొట్టిన రికార్డులు…జీరో కోంట్రవర్సీస్… హైప్ కోసం మాటలు, డ్రామాలు ఏమీలేని స్వభావం… ఇవన్నీ ఆ యాక్టర్‌కి రెండు దశాబ్దాల్లో సహజంగా ఎదిగిన ‘బ్రాండ్ ప్రభాస్’ని మరింత స్పెషల్ చేశాయి.

కానీ ఈ నేచురల్ ఇమేజ్‌ని పాడు చేస్తున్నది ఎవరో తెలుసా?
ప్రభాస్ కాదు… ఆయన డైరెక్టర్లే.

సందీప్ రెడ్డి వంగా ‘Spirit’ ఇంట్రోలో “ఇండియా’s Biggest Superstar” అని ఎత్తేస్తే, బాలీవుడ్ ట్రోల్స్ లెక్కలు లేకుండా దూసుకొచ్చారు.
ప్రభాస్‌కి ఒక్క మాట కూడా అనలేదు… కానీ డైరెక్టర్ ఓ లైన్ వేసినంత మాత్రాన ఫ్యాన్ వార్స్,ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇదే స్టైల్‌ను ఇప్పుడు మారుతి కూడా రిపీట్ చేస్తూ “Pan-India No.1” అంటూ ప్రోమోల్లో పిలుస్తున్నాడు.
అది వినగానే సోషల్ మీడియాలో మరో రౌండ్ వాయింపు మొదలైంది.

ప్రశ్న మాత్రం ఒక్కటే—
స్వభావంగా లో-కీగా ఉండే హీరోకి ఈ బలవంతపు ఎలివేషన్స్ ఎందుకు?
ఎవరికి దీనివల్ల లాభం?
ప్రభాస్‌కా? డైరెక్టర్లకా? లేక ట్రోల్స్‌కా?

ఇలాంటి ఓవర్ హైప్ డైలాగులు
ప్రభాస్ రెండు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన క్లీన్, ప్రశాంతత, నాన్-షోఆఫ్ ఇమేజ్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి.

ఇంకా ఇలాగే కొనసాగితే హైప్ కాదు… హాని మాత్రమే జరుగుతుంది.
కావాల్సింది ప్రభాస్ స్టైల్ —
పనితో ఎలివేషన్…
సైలెన్స్‌తో స్టార్డమ్.

ప్రభాస్ టీమ్ ఎవరో ఒకరు అయినా ఈ బలవంతపు ఎలివేషన్స్ ఆపాలి… లేకపోతే సోషల్ మీడియా ట్రోల్స్‌కి ఫ్రీ ఫుల్ మీల్స్ రెడీ అవుతూనే ఉంటాయి.

Similar Posts