సినిమా వార్తలు

మహేష్ తో మేము చేసిన పెద్ద పొరపాట్లు అవే, అందుకే డిజాస్టర్స్

అఖండ 2 డిసెంబర్ 5 రిలీజ్‌ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేఫద్యంలో నిర్మాతలు రామ్ ఆచంట – గోపీ ఆచంట బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. అదే సమయంలో తాము గతంలో మహేష్ తో చేసిన చిత్రాలు డిజాస్టర్స్ అవ్వటానికి కారణాలు చెప్పుకొచ్చారు.

1–నేనొక్కడినే టైమ్‌లో చేసిన ‘బ్లండర్’… ఇదే మహేష్ సినిమా ఫేట్ మార్చేసిందా?

ఇక్కడే బిగ్ బాంబ్ పేల్చేశారు ఆచంట బ్రదర్స్… “1–నేనొక్కడినే లో హీరో ప్రాబ్లమ్‌ను ట్రైలర్‌లో రివీల్ చేయకపోవడం… అది మా పెద్ద పొరపాటు!
అదే సినిమా రిజల్ట్‌ దారుణంగా రావటానికి కారణం అయ్యింది” అని చెప్పారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో టీమ్ తో పెద్ద డిబేట్ జరిగి… చివరకు రివీల్ చేయకూడదని నిర్ణయించుకున్నాం. “అదే బ్లండర్…!” అని ఓపెన్‌గా అంగీకరించారు.

“ఆగడు… అది దూకుడు తర్వాత రావడం మా దురదృష్టం!”

అగడు విషయం మీద కూడా షాకింగ్ స్టేట్‌మెంట్:

“ఆగడు… దూకుడు కంటే ముందు వచ్చి ఉండాల్సిన సినిమా. ముందుగా వచ్చి ఉంటే బిగ్ బ్లాక్‌బస్టర్ అయ్యేది! కానీ దూకుడు తో వచ్చిన హై ఎక్స్‌పెక్టేషన్స్‌… అగడును వేరే ట్రాక్‌కి తీసుకెళ్లిపోయాయి” అన్నారు.

“OTTలు తెలుగు సినిమాలు కొనడం ఆపేస్తాయా?” – నిర్మాతల స్పష్టమైన జవాబు

ఇండస్ట్రీలో రూమర్స్‌గా ఉన్న “OTTలు తెలుగు సినిమాలు కొనటం తగ్గిస్తున్నారు?” అన్న ప్రశ్నకు కూడా వారు క్లారిటీ ఇచ్చారు. “Netflix, Amazon లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కు తెలుగు మార్కెట్ చాలా పెద్దది. పూర్తిగా ఆపడం అసాధ్యం.” అని ఇద్దరూ చెప్పారు.

అలాగే అఖండ 2 చిత్రం టిక్కెట్ రేట్లు పెంచటం గురించి చెప్తూ.. “ఇద్దరూ కలిసి వస్తే టికెట్ రేట్లు పెరగాల్సిందే… రికార్డులు బ్రేక్ అయిపోవాల్సిందే” అంటున్నారు ఈ నిర్మాతలు. బయ్యర్లు కూడా లాభాల్లో ఉండాలన్నదే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు.

బాలయ్య–బోయపాటి ఫార్ములా మీద వచ్చిన డౌట్లు… స్ట్రైట్ గానే సమాధానాలు!

బోయపాటి మూవీ అంటే..మొదట యంగ్ బాలయ్య…ఇంటర్వెల్ దగ్గర న్యూ కేరెక్టర్, సెకండ్ హాఫ్ మాస్ రాంపేజ …అన్న ఫార్ములాపై వస్తున్న విమర్శలకూ వారు క్లియర్ రిప్లై ఇచ్చారు. “అది ఫార్ములా కాదు… ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్!” అని చెప్పారు.

Similar Posts