టాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం ఏదో ఒక పేరు హాట్ టాపిక్ అవుతుంది. కానీ 2025 విషయానికి వచ్చేసరికి ఆ చర్చకి స్పష్టమైన సమాధానం ఒక్కటే — అనీల్ రావిపూడి. వరుస హిట్స్ ఉన్న దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ హిట్‌ని మాత్రమే కాదు, ఆ హిట్ చుట్టూ ఒక నమ్మకాన్ని, ఒక బ్రాండ్ ఇమేజ్‌ని నిర్మించగలిగిన దర్శకులు మాత్రం అరుదు. ఆ అరుదైన జాబితాలో 2025 నాటికి అనీల్ రావిపూడి అగ్రస్థానంలో నిలిచారు.

సాధారణంగా ఒకే తరహా విజయాలు వస్తే, అదే ఫార్ములా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. దర్శకుడి బ్రాండ్ డైల్యూట్ అవుతుంది. కానీ అనీల్ రావిపూడి కెరీర్‌లో అది జరగలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే తేలికైన సినిమా అన్న అపోహని ఆయన పూర్తిగా బ్రేక్ చేశారు. పండుగ సీజన్ అంటే భారీ యాక్షన్, భారీ బడ్జెట్, మాస్ హంగామా అన్న ట్రెండ్ నడుస్తున్న సమయంలో, F2: Fun and Frustrationతో ఆ పంథాను పూర్తిగా మార్చేశారు. నవ్వు, కుటుంబ ప్రేక్షకులు, రీప్లే వ్యాల్యూ — ఇవే పండుగ సినిమాల అసలైన ఆయుధాలని అప్పుడే నిరూపించారు.

ఆ తర్వాత సంక్రాంతి బరిలో Sarileru Neekevvaru లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్‌తో మరోసారి తన మార్క్ వేసారు. స్టార్ హీరో, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా మొత్తం కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నడిపించగలిగిన తీరు అనీల్ రావిపూడి స్పెషాలిటీగా మారింది. అప్పటికే ఆయన సినిమాలంటే “కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి” అనే ముద్ర పడిపోయింది.

2025లో వచ్చిన Sankranthiki Vasthunnam ఆ ముద్రని బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లింది. విక్టరీ వెంకటేష్ సింగిల్ లీడ్‌గా చేసిన ఈ చిత్రం, సీనియర్ హీరోలలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు 300 కోట్ల గ్రాస్‌తో, ఏడాదిలోనే బెస్ట్ ROI హిట్‌గా ఇండస్ట్రీని షాక్ చేసింది. అదే సమయంలో భారీ యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమానే ఎంచుకున్నారు. ఇది యాదృచ్ఛిక విజయం కాదు — ఎనిమిది సినిమాలుగా నిర్మించుకున్న ట్రస్ట్ రిజల్ట్.

ఇక్కడే ఇండస్ట్రీ అవుట్‌లుక్ మారింది. “సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్” అన్న మాట మళ్లీ ట్రెండ్ అయింది. కానీ ఆ ట్రెండ్‌ని స్టార్ట్ చేసినవాడు అనీల్ రావిపూడి అయితే, దాన్ని క్యాపిటలైజ్ చేయగలిగే స్థాయిలో ఉన్నవాడు కూడా ఆయనే. అందుకే 2026 సంక్రాంతికి రాబోతున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ Mana Shankara Vara Prasad Garuపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఒక ఈవెంట్. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో బలమైన హైప్ క్రియేట్ చేశాయి. అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూడకముందే, “అనీల్ రావిపూడి సినిమా” అన్న ఒక్క ట్యాగ్ చాలు అన్న ఫీలింగ్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.

అంతిమంగా చెప్పాలంటే, 2025లో అనీల్ రావిపూడి సాధించినది కేవలం బాక్సాఫీస్ విజయం కాదు. ప్రేక్షకుల నమ్మకం, కుటుంబ ఆడియెన్స్ లాయల్టీ, పండుగ సినిమాలపై ఆయన పట్టు — ఇవన్నీ కలిసి ఆయనను ఒక దర్శకుడిగా కాకుండా, ఒక స్వతంత్ర బ్రాండ్‌గా నిలబెట్టాయి. అందుకే 2025 ఒక్క మగాడు అనీల్ రావిపూడి ఒక్కడే అనే హెడ్డింగ్ అతి కాదు, ఓ ఫ్యాక్ట్.

#2025, #Anil Ravipudi, #F2: Fun and Frustration, #King of Entertainment, #Mana Shankara Vara Prasad Garu, #Sankranthiki Vasthunam

By admin