మొత్తానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు ఎదురుచూస్తున్నట్లుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడైంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థపై ఇది రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఆయనకు విషెస్‌ చెప్పింది.

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ …అట్లీతో ఓ సినిమా చేయనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదే విషయాన్ని ఖరారు చేస్తూ సన్‌ పిక్చర్స్‌ పోస్ట్‌ పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ వివరాలు పంచుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది.

ఇక ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు చూపించారు. అంత‌ర్జాతీయంగా పేరు గాంచిన గ్రాఫిక్స్ స్టూడియోల్ని బ‌న్నీ, అట్లీ ఇద్ద‌రూ సంద‌ర్శించి, అక్క‌డి గ్రాఫిక్ నిపుణుల‌కు క‌థ చెప్ప‌డం, వాళ్ల రియాక్ష‌న్స్‌కి క్యాప్చ‌ర్ చేయ‌డం ఈ వీడియోలో క‌నిపించిన దృశ్యాలు. అవ‌తార్ లాంటి సినిమాల‌కు ప‌ని చేసిన గ్రాఫిక్ సంస్థ‌లు బ‌న్నీ సినిమా కోసం వ‌ర్క్ చేయ‌బోతున్నాయి.

ఏదైమైనా అభిమానుల ఊహలకు అందని రీతిలో ఈ సినిమా ఉండనుందని తెలిపారు. ఇందులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. హాలీవుడ్ తరహాలో విజువల్స్‌ ఉండనున్నట్లు తెలిపారు. వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఇలాంటి స్క్రీప్ట్‌ ఇప్పటివరకూ చూడలేదన్నారు. అల్లు అర్జున్‌కు స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన విజువల్స్ ఇందులో చూపించారు.

, , , ,
You may also like
Latest Posts from