అమీర్ ఖాన్ అంటేనే కొత్తదనం. సినిమాల్లో ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకునేవాడు కాదు. సంవత్సరాల స్టడీ, స్క్రిప్ట్ మేచ్యూరిటీ, వ్యక్తిగత ఇన్వాల్వ్‌మెంట్ – ఇవన్నీ కలిసే అతను ఓ కథను అంగీకరిస్తాడు. అందుకే ఆయనకు Mr. Perfectionist అనే బిరుదు వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అతని కెరీర్ పాత ఫార్మ్ కోల్పోయినట్టే కనిపించింది. లాల్ సింగ్ చడ్డా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అందరి చూపు ఇప్పుడు అతని తదుపరి ప్రయత్నంపై పడింది.

మరి ఆ ప్రయత్నమే ‘సితారే జమీన్‌ పర్‌’. ఈరోజు ఫస్ట్ లుక్ విడుదలవడంతో ఒక్కసారిగా బాలీవుడ్ దృష్టంతా ఈ చిత్రంపైకి మళ్లింది. టైటిల్ చూస్తే ‘తారే జమీన్ పర్’ గుర్తొస్తుంది కదా? అదే జ్ఞాపకాలే మరలా ఊపిరి పీల్చుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో అమీర్ ఖాన్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాల్లోకి వెళదాం.

బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్ (AamirKhan), జెనీలియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా జూన్‌ 20న విడుదల కానుందని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది చిత్ర టీమ్. ‘‘ప్రేమ, నవ్వు, ఆనందాలను చేసుకునే చిత్రం’’ అనే కామెంట్ ని జోడించింది.

గతంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘తారే జమీన్‌ పర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది (Sitaare zameen par). మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి మంచిగా ఎలా మారుతాడు అనే కథాంశం చుట్టూ తిరుగుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా కనిపించి సినీ ప్రియులను ఆకట్టుకోనున్నారు ఆమిర్‌.

ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్‌’ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం.

ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్ పర్‌’ (2007) సినిమాకు స్పిరిచ్యువల్‌ సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్‌’ చిత్రం తెరకెక్కిందని, స్పానిష్‌ ఫిల్మ్‌ ‘ఛాంపియన్స్’ (2018) ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని బాలీవుడ్‌ టాక్‌. అలాగే దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు నెలకొన్నాయి.

, , ,
You may also like
Latest Posts from