కొన్ని ఓటములు మనల్ని వెనక్కి లాగవు… ఎదుగుదలకోసమే దారులు చూపిస్తాయి. ఇదే ఇప్పుడు వంశీ పైడిపల్లి సినీ ప్రయాణంలో మరోసారి రుజువవుతోంది.
వంశీ పైడిపల్లి గత చిత్రం ‘వరిసు’ సినిమా కమర్షియల్‌గా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయిన సమయంలో, టాలీవుడ్‌లో పలువురు వంశీపైడిపల్లిని పట్టించుకోలేదు. కథలు వినటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో “ఇంకెవ్వరూ అవకాశం ఇవ్వరు” అనే స్థితిలోకి వచ్చాడని అనుకుంటున్న చేసిన టైంలో… వంశీ ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడు. తన శైలిలో – కాని ఇంటర్నేషనల్ స్థాయిలో ఆకట్టుకునేలా. ఆ కథతో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దగ్గరకు వెళ్లారు.
ఈ కథ విన్న అమీర్ ఖాన్ తట్టకుండా “Yes” అన్నాడట! సీన్స్ లో డెప్త్, ఎమోషన్, డైలాగ్స్ అన్నీ కలిపి వంశీ స్టోరీపై అమితమైన నమ్మకం వ్యక్తం చేశాడట. ఈ సినిమా షూటింగ్ ఈ జూన్‌లో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఆమోద ప్రక్రియ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుంది. ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రూపొందనుండటంతో, బడ్జెట్ పరంగా కూడా ఇది ఒక బిగ్ స్కేల్ మూవీ అవుతుందని సమాచారం.
ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుందని వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేయగా, వంశీ పైడిపల్లి – అమీర్ ఖాన్ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.