పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్టింగ్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు – బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామా, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన పవన్, ఇప్పుడు మూడో సినిమా షూట్ పూర్తి చేయటం కోసం సిద్ధమవుతున్నారు!

మాస్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే వెంటనే గబ్బర్ సింగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు అదే క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. కానీ ఈసారి మరింత మాస్, మరింత స్టైల్, మరింత అగ్రెషన్‌తో! మైత్రి మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో పవన్ తన swagతో సెట్‌లో అడుగుపెడుతున్న తీరు అభిమానుల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది.

జూన్ 10 నుంచి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ దాదాపు 30 రోజులు నాన్‌స్టాప్ గా జరగనుందని సమాచారం. అందులో కీలకమైన మేజర్ సన్నివేశాలన్నీ పూర్తి చేయనున్నారు. పవన్‌కు ఇది ఓ పొలిటికల్ మాస్ లెవల్ ఎంట్రీ లా ఉండబోతుందని బజ్.

శ్రీలీలకు బ్రేక్ !

ఇక హీరోయిన్ శ్రీలీల విషయానికొస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనేది ఆమె కెరీర్‌ను మళ్లీ నిలబెట్టే లైఫ్ లైన్ అవుతుందా అన్నది హాట్ టాపిక్. ఇటీవల ‘రాబిన్ హుడ్’ ఫలితాన్ని తలచుకుంటే ఆమెకు ఈసారి విజయమే అవసరం.

మొదట్లోనే ఈ సినిమాకు సైన్ చేసినా, ఇది ఆలస్యమవుతూ వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో, ఈసారి బ్లాక్‌బస్టర్ తప్ప మరో ఆప్షన్ లేదన్నట్టుగా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తోంది శ్రీలీల.

హరీష్ శంకర్ – దేవిశ్రీ రీపీట్ మ్యాజిక్?

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురు మళ్లీ ఒక్కటవ్వడమే ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్. మాస్ డైలాగ్స్, ఫుల్ ఎనర్జీ మ్యూజిక్, స్టైల్‌తో కూడిన పవన్ రీ ఎంట్రీ – ఇవన్నీ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

#Harish Shankar, #Mythri Movie Makers, #Pawan Kalyan, #Sreeleela, #Ujwal Kulkarni, #Ustaad Bhagat Singh

By admin