పాపులారిటీ అంటే అందరినే ఆకట్టుకోవడమా? లేక ఎంతమందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసామన్నదా ? అనసూయ భరద్వాజ స్టైల్ చూస్తే రెండోది మాత్రమే కొట్టిచ్చినట్టు కనపడుతోంది. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ, ఇప్పుడు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. కానీ ఆమె అసలైన రికార్డ్ మాత్రం… సోషల్ మీడియా బ్లాక్‌ల జాబితాలో!

ఒక్క ఇంటర్వ్యూలోనే తానే స్వయంగా చెప్పింది – ఇప్పటివరకు బ్లాక్ చేసినవాళ్ల సంఖ్య 3 మిలియన్లు దాటిందట! ఇది వినగానే ఒకటే ప్రశ్న – ఇంత మందిని తిట్టడానికి సమాజంలో ఎంత సమయముంది? కానీ అనసూయ మాత్రం దీన్ని ఓ గేమ్‌లా ట్రీట్ చేసింది. “నెగటివ్ కామెంట్ వేస్తే, నువ్వు గేమ్ ఓవర్ – డైరెక్ట్ బ్లాక్!” అని చెప్పకనే చెబుతోంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ బ్లాకింగ్ స్ప్రీ జరిగినా కూడా ఆమెకు ఇప్పటికీ 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పోలిస్తే, పెద్ద సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్నా, పూజా హెగ్డే లాంటి స్టార్‌ హీరోయిన్లు 5 మిలియన్ల పైగా ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నారు. కానీ అనసూయ మాత్రం అటువంటి హై-ఫ్రొఫైల్ లైన్‌లో లేకపోయినా, తన బ్లాక్ చేసిన వారి కౌంట్‌తోనే ట్రెండ్ సెట్ చేస్తున్నది.

“నెగటివ్ కామెంట్ అంటే నేను బ్లాక్ చేస్తాను. అంతే,” అని చెప్పిన అనసూయ, ట్విట్టర్ (ప్రస్తుతం X) యాప్‌నే చాలాసార్లు డీయాక్టివేట్ చేసి మళ్లీ వచ్చిందట. ట్రోల్స్ వచ్చారు, కామెంట్లు వేశారు… కానీ ఆమె మాత్రం “బ్లాక్ బటన్” అనే ఆయుధంతో ఎదురు తన్నేసింది.

ఇప్పుడు కొత్త ఫార్ములా ఇదే: “ఫాలోవర్స్ పెంచుకోవాలా? మొదటగా వారిని వడపోయి – తిట్టేవాళ్లను బ్లాక్ చేయి. మిగిలినవారే నీ సొంత ప్రపంచం!”అనసూయ ప్రపంచంలోకి మీరూ స్వాగతం చెప్పాలంటే… జాగ్రత్త. ఒక్క కామెంట్ కూడా ఆమెకు నచ్చకపోతే… మీరు కూడా ఆ బ్లాక్ జాబితాలో చేరిపోవచ్చు!

,
You may also like
Latest Posts from