ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 18నుంచి కేరళలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుందని సమాచారం. దాదాపు వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై ఓ పాట షూట్ చేయనున్నారని.. దీనికి ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ నృత్యరీతులు అందిస్తారని తెలిసింది.

అలాగే ప్రభాస్‌ కోసం ఎప్పటికీ చూడని ఎంట్రీ సీన్‌ ప్లాన్‌ చేస్తున్నాడట మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌. ‘ద రాజా సాబ్’ లో ప్రభాస్‌ మొదటి సీన్‌కే సీట్లో కూర్చోనివ్వని హంగామా ఉండబోతోందట.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం… ప్రభాస్‌ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం థమన్‌ ప్రత్యేకంగా ర్యాప్ సాంగ్ రెడీ చేస్తున్నాడు. అందుకోసమే పాపులర్‌ ర్యాపర్‌, సింగర్‌ హనుమాన్ కైండ్ (సూరజ్ చెరుకట్) ను రోప్‌ఇన్‌ చేసుకున్నాడు. ప్రభాస్‌ పాత్ర మాస్ ఆడియెన్స్‌కు అలరించేలా ఉండటంతో, ఆయన ఎంట్రీకి హిప్‌హాప్ బీట్‌తో కూడిన ర్యాప్ సాంగ్ ఖచ్చితంగా షో స్టాపర్ అవుతుందని అంటున్నారు.

‘బిగ్ డాగ్స్‌, అయ్యయ్యో, రన్ ఇట్ అప్’ లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయిన హనుమాంకైండ్‌ ఈ సాంగ్‌ను తన సిగ్నేచర్‌ స్టైల్‌లో పాడబోతున్నాడు. ఇక ఆ పాటకు ఆస్టార్‌ కొరియోగ్రాఫర్‌, ఆస్కార్‌ విన్నర్‌ ప్రీమ్ రక్షిత్ స్టెప్పులు వేయనున్నారు. ప్రభాస్‌ అయితే వింటేజ్ లుక్‌లో అలరించబోతున్నాడు.

ఈ స్పెషల్‌ ర్యాప్ ట్రాక్‌ను అక్టోబర్ 23న ప్రభాస్‌ బర్త్‌డే ట్రీట్‌గా రిలీజ్ చేయనున్నారు. కేరళలో ఈ వారమే సాంగ్ షూట్ మొదలవుతుందట. డైరెక్టర్ మారుతి దీన్ని విజువల్ స్పెక్టకిల్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇక దీని తర్వాత అక్టోబరులో గ్రీస్‌లో మరో షెడ్యూల్‌ మొదలు కానుందని.. అక్కడే మూడు పాటలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర తొలి ట్రైలర్‌ను వచ్చే నెల ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాతో పాటుగా విడుదల చేయనున్నారు.

జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘ద రాజా సాబ్’ లో సంజయ్‌ దత్, మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from