
ఆండ్రియా న్యూడ్ సీన్ డిలేట్, బిజినెస్ కు పెద్ద దెబ్బే ? అసలు ఏం జరిగింది?
ఆండ్రియా ‘న్యూడ్ సీన్’ చేస్తుందని వచ్చిన ఒక్క రూమర్‌తోనే Pisasu-2 మీద అంచనాలు అసాధారణంగా పెరిగిపోయాయి. మిస్కిన్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది… కానీ ఆ న్యూస్ మాత్రం ఈ సీక్వెల్‌కి బోల్డ్ హైప్ తెచ్చింది. కథ డిమాండ్ అని ఆండ్రియా స్వయంగా చెప్పటంతో ఆ బజ్ మరింత పెరిగింది.
కానీ… తాజా సమాచారం ప్రకారం, ఆ న్యూడ్ సీన్‌ను స్క్రిప్ట్ నుంచి పూర్తిగా తొలగించినట్లు ఆండ్రియా క్లియర్‌గా చెప్పేసింది! షూటింగ్ సమయంలో ఆ సీన్ కథకు నిజంగా అవసరమా అనే చర్చ జరిగిందనీ, చివరకు మిస్కిన్ దానిని పక్కన పెట్టేశాడనీ ఆమె వెల్లడించింది.
అయితే… న్యూడ్ సీన్ లేకపోయినా, ఈ సినిమాలో బోల్డ్ & ఎరోటిక్ సీక్వెన్సులు మాత్రం పక్కా ఉంటాయనీ, అవి ప్రేక్షకులను షాక్‌లోకి నెట్టే విధంగా ఉంటాయని ఆండ్రియా గ్యారంటీ ఇచ్చింది. ఇది మిస్కిన్‌కు సర్వైవల్ ఫిల్మ్ అని, అలాంటి డైరెక్టర్ కోసం ఏ రిస్క్‌కైనా సిద్ధమేనని ఆమె చెప్పింది.
ఈసారి కథ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందని టీమ్ నమ్మకం. అదీకాక విలన్‌గా విజయ్ సేతుపతి, కీలక పాత్రలో పూర్ణ ఉండటంతో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. వచ్చే వేసవికి విడుదల చేసే అవకాశాలున్నాయి.
కానీ ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే…
ఈ సినిమాకి భారీ హైప్ తెచ్చిన న్యూడ్ సీన్ లేకపోవడం బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ట్రెండ్ మార్చే థ్రిల్లర్ అవుతుందా? లేక బోల్డ్ బజ్ లేకపోవడంతో మొదటి దెబ్బ తింటుందా?
ట్రేడ్ లో ఇదే పెద్ద చర్చగా మారింది…
