ప్రస్తుతం మ్యూజిక్ మార్కెట్‌ని డామినేట్ చేస్తున్న పేరు అనిరుథ్. పాటలు ఎలా ఉన్నా, ఆయన ఇచ్చే BGM సినిమాకే కొత్త ప్రాణం పోస్తుంది. సినిమా పబ్లిసిటీ స్టేజ్ నుంచే – “అనిరుథ్ మ్యూజిక్!” అనగానే హైప్ క్రియేట్ అవుతోంది. అందుకే నిర్మాతలు పారితోషికంపై తగ్గేదే లేదు అంటున్నారు…

ఈ క్రమంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పేరు మోగిపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అడిగితే, ముందుగా వినిపించే పేరు అనిరుథ్ రవిచందర్. శివకార్తికేయన్ వంటి యంగ్ స్టార్స్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు — ప్రతీ పెద్ద హీరో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికలో “అనిరుథ్ కావాలి!” అనే మాటే మొదట వస్తోంది. అలాంటి అనిరుథ్ కు ఎంత ఇస్తున్నారు. రెమ్యునేరన్ ఎంత ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

15 కోట్లు పారితోషికం?.. దేశంలోనే టాప్!

ప్రస్తుతం అనిరుథ్‌కు ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ లభిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఓపెన్ సీక్రెట్.
ఒక్కో సినిమాకి కనీసం రూ.15 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. ఇటీవల నాని ‘ప్యారడైజ్’ అనే చిత్రానికి ఆయనకి రూ.15 కోట్లు ఇచ్చినట్టు సమాచారం.

అయితే.. అచ్చంగా అదే సినిమా ఆడియో రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడవడం, అనిరుథ్ పేరు విన్నారంటేనే మార్కెట్ ఎలా పని చేస్తుందో స్పష్టమవుతోంది!

, , ,
You may also like
Latest Posts from