ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఎన్‌ఎస్‌ఈలోని ప్రతిష్ఠాత్మక “బెల్ రింగ్” వేడుకలో పాల్గొని గంట మోగించారు. స్టాక్ మార్కెట్‌లో మైలురాయి తరహా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ప్రత్యేక అతిథులతో గంట మోగించడం ఆనవాయితీ.
ఇక హైలైట్ ఏంటంటే…
ఈ అరుదైన అవకాశాన్ని దక్షిణాదిలో మొదటిసారి పొందిన నటుడు బాలకృష్ణ కావడం విశేషం!
సేవాస్పూర్తితో పాటు సినీ కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా అందిస్తున్న సేవలు—అన్నీ కలిసి ఆయనకు ఈ గౌరవాన్ని తీసుకువచ్చాయి.
హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఇటీవల లండన్‌కు చెందిన “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” లో కూడా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఏదైతేనేం “NSE బెల్ రింగ్ గౌరవం పొందిన తొలి సౌత్ ఇండియన్ హీరో బాలకృష్ణ”. ఆయన మరింత మందికి స్పూర్తి ఇస్తారు.