బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే అభిమానులను ఆకట్టుకుంది. థియేటర్‌లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన హవా చూపించింది. అందరూ మర్చిపోతున్న ఈ టైమ్ లో ఈ సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’కు సంబంధించిన ఆర్టికల్‌ అరబిక్‌ న్యూస్‌ పేపర్‌లో వచ్చింది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. దీనికి సబంధించిన ఫొటోను ఎక్స్‌లో బాలకృష్ణ (Balakrishna) అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

ఏముంది ఆర్టికల్ లో ..

‘డాకు మహారాజ్‌’లో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నాయని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. హీరో పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని రాబిన్‌హుడ్‌ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దీని కథ గురించి, కలెక్షన్ల వివరాలను ప్రస్తావించారు.

తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్‌ న్యూస్‌ పేపర్‌లో రావడం అరుదంటూ బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు.

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా, బాబీదేవోల్‌ కీలకపాత్రలు పోషించారు.

, , , ,
You may also like
Latest Posts from