సూపర్‌స్టార్ రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ పై పాన్ఇండియా అటెన్షన్ పెరిగింది. ఈ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ క్యామియో చేస్తారనేది ఇటీవల కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు. అంతే కాదు… చిన్న రోల్‌కే బాలయ్య 50 కోట్లు తీసుకుంటున్నాడు అని గాసిప్స్ బాగా రన్ అయ్యాయి.
కానీ… ఇది నిజం కాదు!
సోర్సెస్ చెబుతున్నది ఏమిటంటే—రజనీ అంటే బాలయ్యకు గౌరవం వేరే లెవెల్. రజనీ కోసం “ఓకే చెయ్యాలా?” అని కూడా అనుకున్నారట. కానీ… జైలర్ 2 కోసం పెద్ద డేట్స్ కావడంతో బాలయ్యకు అది పాసిబుల్ కాలేదట.
“నా సినిమాలకే టైం సరిపోవట్లేదు” అన్నట్టుగానే బాలయ్య ఒప్పుకోలేదని టాక్.
ఇక మీడియా ఊదరగొట్టినట్లు బాలయ్య జైలర్ 2 లో ఉంటారని కాదు… ఆ రోల్ ఇప్పుడు ఫహద్ ఫాజిల్‌కి వెళ్లిపోయిందని కోలీవుడ్ టాక్.
అసలేం జరిగింది
అఖండ 2 కోసం హిమాలయాల్లో షూట్, పొలిటికల్ షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్… ఇలా బాలయ్యకు ఇప్పుడు టైమ్ అసలే లేదు. జైలర్ 2 కోసం ఫ్యాన్స్ ఊహించిన గోడెసి రాయల సింహం–తలైవర్ కంబినేషన్ అయితే ఈసారి కనపడదు.
ఫ్యాన్స్ ఓపిక పట్టాలి…
బాలయ్య–రజనీ స్క్రీన్ మీద కలిసే రోజు రావొచ్చూ… కాని ఇది ఆ సినిమా కాదు!

