ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం విడుదల అయ్యింది. అయితే ఒక రోజు ముందుగా అంటే నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ తో మొదలైంది. అది కూడా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ లలో పడ్డాయి.

ప్రచారంలోనే సరదా, క్యూట్ వైబ్స్‌తో పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ , పెద్ద అంచనాలు లేకుండానే వస్తోంది — అదే ఈ సినిమా స్ట్రాంగెస్ట్ అడ్వాంటేజ్. గతంలో Baby , Little Hearts వంటివి అంచనాలు లేకుండానే బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినట్లు, బ్యూటీ కూడా అదే జాబితాలో చేరుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంకిత్ కొయ్యి ( ఆయ్ , మారుతి నగర్ సుబ్రమణ్యం ఫేమ్)కి ఇది అసలు లిట్మస్ టెస్ట్. కొత్త హీరోయిన్ నీలాఖితో కెమిస్ట్రీ ఎలా వర్కవుతుందో, అదే సినిమా ఫేట్‌ను డిసైడ్ చేస్తుందనిపిస్తోంది. అయితే ఆర్వీ సుబ్రహ్మణ్యం అందించిన స్క్రిప్ట్, మారుతి కాంపౌండ్ నుంచి క్వాలిటీ కంట్రోలు సినిమాకు ప్లస్ అవుతాయంటున్నారు.

ఈ సినిమా అవుట్ పుట్ మీద మారుతి కూడా చాలా నమ్మకంతో వున్నారు. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చే చిన్న సినిమాలను వెల్ ప్లాన్డ్ పబ్లిసిటీతో జనాల్లోకి తీసుకెళ్తే బాగా నడుస్తున్నాయి. కంటెంట్ బాగుంట్ స్టార్స్ లేకపోయినా చూస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ ఈ సినిమాకూ కలిసి వస్తుందేమో చూడాలి.

ఇక ‘బ్యూటీ’ చిత్రానికి పెద్ద నరేష్ హీరో అని చెప్పాలి. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా నరేష్ నటించిన తీరుకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఆయనే. రిలీజ్ తర్వాత నరేష్ , వాసుకి గారి గురించే ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటారనేది వారి నమ్మకం.

ఈ వారం ‘బ్యూటీ’ తో పాటు భద్రకాళి అనే సినిమా సైతం ప్రామిసింగ్ నోట్ తో విడుదలవుతోంది.

, , , , ,
You may also like
Latest Posts from