
సినిమా ఎంత బాగున్నా, టైటిల్ అనేది మొదటి హుక్. అది క్యాచీగా, ఫన్‌గా లేదా మిస్టరీగా ఉంటేనే జనాల్లో వెంటనే టాక్ క్రియేట్ అవుతుంది.
ఇప్పుడు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” లాంటి టైటిల్ చూసి ఒక్కసారిగా “ఇది ఏంటి బాస్?” అనిపిస్తుంది. అదే డిస్కషన్ పాయింట్ అవుతుంది.
మాస్ మహారాజా రవితేజ – ఫ్యామిలీ ఎమోషన్స్‌లో నిపుణుడు కిషోర్ తిరుమల కాంబోలో ఓ కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. కేతిక శర్మ, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమాస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
ఇప్పటివరకు ఈ మూవీకి ‘అనార్కలీ’ అనే టైటిల్ అనుకున్నారని టాక్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న పేరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్త టైటిల్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సాధారణంగా మనం ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అని వింటుంటాం. దాన్నే క్రియేటివ్‌గా ట్విస్ట్ చేసి భర్తల కథకు తగ్గట్టుగా ఈ టైటిల్ ఫిక్స్ చేశారట.
ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్ అన్నీ రెడీగా ఉన్నా… టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం కొంచెం డిలే చేశారు. అసలే దసరా సందర్భంగా రివీల్ చేయాలనుకున్నారు. కానీ రవితేజ చేతిలో ఉన్న ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న రిలీజ్ కానుండటంతో, దాని తర్వాతే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు.
అంతేకాదు, 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మొత్తంగా ఫ్యామిలీ డ్రామాల మధ్యే జరగనుంది. ‘రాజాసాబ్’ లో ఫ్యామిలీ ఎమోషన్లు, ‘మన శివశంకర ప్రసాద్‌గారు’ ఫ్యామిలీ డ్రామాతో వస్తుంటే, రవితేజ కొత్త సినిమా కూడా అదే రూట్లో… కానీ టైటిల్ వల్లే ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించేసింది.
