తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో (Retro)కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రెట్రో మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రీబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.

ఈ మేరకు X వేదికగా నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. ” అద్భుతాలు సృష్టించబోతున్న వ్యక్తి కోసం మేము ఎదురుచూస్తున్నాము.. రెట్రో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మేము పొందామని ప్రకటించడానికి మాకు చాలా ఆనందంగా ఉందని” నాగ వంశీ ట్వీట్ చేశాడు.

రెట్రో పంపిణీదారుల జాబితా:

ఆంధ్రప్రదేశ్+తెలంగాణ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తమిళనాడు -శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ
ఓవర్సీస్ – AP ఇంటర్నేషనల్
సింగపూర్ – హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్
UK – బోలీన్ సినిమా

ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

సూర్య, జ్యోతిక నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపొందుతోంది.

, ,
You may also like
Latest Posts from