
బాలీవుడ్ స్టార్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది. రూ.60 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దంపతులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా, కోర్టు స్పష్టంగా “ముందు డబ్బులు డిపాజిట్ చేయండి – తర్వాతే ఆలోచిస్తాం!” అని షరతు విధించింది.
వివరాలు ఇలా ఉన్నాయి
శిల్పా, రాజ్ కుంద్రా దంపతులపై ఓ వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు ఆధారంగా ముంబయి పోలీసుల ఈఓడబ్ల్యూ విభాగం ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది. అంటే దేశం విడిచి వెళ్లడం లీగల్గా అసాధ్యం.
అయితే, శిల్పాశెట్టి అక్టోబర్ 25–29 మధ్య కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్ కు వెళ్లాల్సి ఉందని కోర్టును ఆశ్రయించారు. కానీ విచారణలో హైకోర్టు స్పష్టం చేసింది —
“ఈవెంట్ అధికారిక ఆహ్వానం ఉందా?” అని అడగగా, ఆమె తరఫు న్యాయవాది “ఇప్పటివరకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం వచ్చింది” అని చెప్పడంతో, ధర్మాసనం అనుమతిని నిరాకరించింది.
“ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి – తర్వాతే విదేశీ పర్యటనపై విచారణ జరుగుతుంది” అని కోర్టు గట్టి షరతు పెట్టింది.
ఇక ఈ తీర్పుతో శిల్పాశెట్టి దంపతులు మళ్లీ లీగల్ బంధనాల్లో చిక్కుకున్నారు!
