ఈ మధ్యకాలంలో వరస వివాదాలతో ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది! తాజాగా ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘ఎక్స్‌పీరియన్స్ అబుదాబి’ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అబుదాబి సుందర దృశ్యాలను, సంస్కృతిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో తెరకెక్కిన ఈ వీడియోలో దీపికా హిజాబ్ మరియు అబాయా ధరించి కనిపించడం ట్రోల్స్‌కు ఎరగా మారింది.

హిజాబ్‌లో దీపికా కనిపించగానే కొంతమంది నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.

“హిందూ అమ్మాయిగా ఉండి డబ్బుల కోసం హిజాబ్ వేసుకున్నావా?”, “ఫెమినిస్ట్ యాక్ట్ ఎక్కడిపోయింది?” అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “సాధారణ దుస్తుల్లోనైనా ప్రమోట్ చేయవచ్చు కదా…!” అంటూ మరికొందరు ట్రోల్ చేశారు.

హిజాబ్ వేసుకుని ధరించి మరీ అక్కడి ప్రదేశాల గురించి మాట్లాడటం అంటే.. డబ్బుల కోసం ఏమైనా చేసేస్తా అని చెబుతున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో దీపిక పేరు సోషల్ మీడియాలో మళ్లీ వివాదంగా మారింది.

అయితే దీపికా అభిమానులు మాత్రం తక్షణమే కౌంటర్ ఇచ్చారు — ఆమె గతంలో హిందూ ఆలయాలకు వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తూ,
“దీపికా ఎప్పుడూ ప్రతి మతాన్ని గౌరవిస్తుంది. ఆలయంలో పట్టు చీరలోనూ, మసీదులో హిజాబ్‌లోనూ కనిపించగలిగే నిజమైన భారతీయురాలు ఆమె!” అంటూ సమర్థిస్తున్నారు.

ఇదిలా ఉంటే, దీపికా ఇటీవల ప్రభాస్‌తో కల్కి 2, స్పిరిట్ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న విషయం కూడా చర్చలో ఉంది. ఆమె పెట్టిన షరతులు — ఎనిమిది గంటల షూటింగ్ షిఫ్ట్, భారీ సిబ్బందికి ఫైవ్‌స్టార్ వసతి, రికార్డు స్థాయి పారితోషికం — నిర్మాతలకు భరించరానివిగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

తల్లితనాన్ని ఆహ్వానించిన తర్వాత సినిమాల్లోకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న దీపికా ప్రస్తుతం అట్లీ – అల్లు అర్జున్ సై-ఫై ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, షారుక్ ఖాన్‌తో కింగ్ సినిమాపై కూడా పని మొదలుపెట్టింది.

కానీ నెటిజన్ల మాటలేంటి?

“స్క్రీన్ మీద హిజాబ్‌లోనైనా, ఆఫ్ స్క్రీన్‌లో ఫెమినిస్ట్‌గానే ఉన్నా — దీపికా తన టర్మ్స్‌పైనే ముందుకెళ్తుంది!” అని ఫ్యాన్స్ గట్టిగా అంటున్నారు.

హిజాబ్‌లో దీపికా – కల్చర్ గౌరవమా? లేక క్యాష్ కమర్షియలా? సోషల్ మీడియాలో డిబేట్ ఆగట్లేదు!

, , , , , ,
You may also like
Latest Posts from