సందీప్ కిషన్ , రావు రమేష్ కాంబినేషన్లో వచ్చిన ‘మజాకా’ (Mazaka)చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా డ్రాప్ లో ఉంది. ‘ధమాకా’ తో దుమ్ము రేపి వంద కోట్ల క్లబ్లో చేరిన త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో క్రేజీ ప్రాజెక్టు అనిపించుకున్నా దాని ఎఫెక్ట్ భాక్సాఫీస్ దగ్గర కనపడటం లేదు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించినా పెద్దగా ఫలితం కనపడటం లేదు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు సందీప్ కిషన్, రావు రమేష్ ల మధ్య ఏదన్నా వివాదం చోటు చేసుకుందా, గొడవ పడ్డారా అనే టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
రీసెంట్ గా మజాకా టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. దీనికి టీం అంతా హాజరయ్యారు. ఒక్క రావు రమేష్ తప్ప. ఆయన ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా ఔట్పుట్ తో అతను సంతృప్తిగా లేడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనకు చెప్పినట్లుగా సినిమా లేదని ఆయన ఫీలయ్యారట. కావాలనే సందీప్ కిషన్ కోసం తన పాత్రను తగ్గించారని ఆయన భావిస్తున్నారట.
అలాగే ఈ సినిమా హీరో సందీప్ కిషన్ తో రావు రమేష్ కి మనస్పర్థలు వచ్చినట్టు చెప్పుకుంటన్నారు. దానికి కారణం ఏంటంటే.. రావు రమేష్ ఈ సినిమా కోసం ఎప్పుడో డేట్స్ ఇచ్చాడట. కానీ సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, ‘రాయన్’ (Raayan) వంటి సినిమాలతో బిజీగా ఉండి.. ‘మజాకా’ప్రక్కన పెట్టారట. దాంతో రావు రమేష్ డేట్స్ వేస్ట్ అయ్యిపోయాయట. అలాగే తన పాత్ర హైలెట్ చేసుకోవటం కోసం సందీప్ కిషన్ ..రావు రమేష్ పాత్రను తగ్గించారనే ఆయన ఫీలవుతున్నారట.
తన స్క్రీన్ స్పేస్ తగ్గించడం పట్ల కూడా ఓ సారి రావు రమేష్ హర్టై , గొడవ పెట్టుకుని సెట్స్ నుండి వెళ్ళిపోయినట్టు ఇన్సైడ్ టాక్.