టాలీవుడ్ లో ఓ హిట్ కొట్టేవరకే ఏ దర్శకుడుకైనా, ఆ తర్వాత ఫుల్ బిజీ అయ్యిపోతారు. అదే ఇప్పుడు “కోర్ట్” డైరెక్టర్ రామ్ జగదీశ్ కు జరుగుతోంది. “కోర్ట్” సినిమాతో ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన రామ్, ఇప్పుడు పెద్ద స్టార్ తో సినిమా చేయబోతున్నాడు.
నాని నిర్మించిన కోర్ట్ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం తన రెండో ప్రాజెక్టు కోసం పెద్ద హీరో తో కాంబో చేస్తున్నాడనే వార్తలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ హీరో మరెవరో కాదు దుల్కర్ సల్మాన్.
ఇప్పుడు, రామ్ జగదీశ్ తన రెండో చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అందులో నాని మరోసారి ప్రొడ్యూస్ చేయబోతున్నాడని సమాచారం అందుతోంది. కోర్ట్ షూటింగ్ సమయంలోనే ఈ అగ్రిమెంట్ అయిపోయిందని తెలుస్తోంది. నాని ఇలాంటి కమిట్మెంట్లు చేయడం చాలా అరుదు, కానీ ఈ సారి అతను కూడా తన కొత్త ప్రాజెక్టును రెడీగా ప్రారంభించేందుకు ముందుకొచ్చాడు.
శైలేష్ కొలను తర్వాత, రామ్ జగదీశ్ కి ఈ అవకాశాన్ని అందించడం చాలా పెద్ద విషయం. దుల్కర్ సల్మాన్ హీరోగా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమా కోసం రెడీ అవ్వుతోందని వినికిడి. అయితే ప్రాధమిక చర్చలలో అంగీకారం వచ్చినట్టు సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్ తుదిరూపంలో ఉండటంతో, అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెండో సినిమాకే ఇంత పెద్ద ప్రమోషన్ అందుకున్న రామ్ జగదీశ్, ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే, టాప్ లీగ్ లో చేరవచ్చు. నాన్ కమర్షియల్ కంటెంట్ తో మొదటి సినిమాతో పెద్ద విజయం సాధించిన రామ్, ఇప్పుడు బడ్జెట్ మరియు స్టార్స్ తో మరింత పెద్ద చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాడు.