జూన్ నెల – సినిమా ప్రియులకు ఓ అద్భుతమైన నెలగా మారనుంది! ప్రతి వారం ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది. ఆ ఎక్సపెక్టేషన్స్, కథలు, నటనలతో సినిమా ప్రియులు తెగ ఎంజాయ్ చేయనున్నారు.ఆ సినిమాలు వరస చూద్దాం

5 జూన్

కమల్ హాసన్ స్టారర్ “థగ్ లైఫ్” విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం 30 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టారు.

13 జూన్

పవన్ కళ్యాణ్ స్టారర్ “హరి హర వీర మళ్లు” విడుదల అవుతుంది. ఈ సినిమా ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకుంది. విడుదల వాయిదాలు ఎదుర్కొన్నా, చివరికి విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ఉంటుంది.

20 జూన్

ధనుష్ నటించిన “కుబేర” విడుదల అవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి అంచనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

20 జూన్

“సితారే జమీన్ పర్” అనే సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది . అంచనాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. “సితారే జమీన్ పర్” అనేది స్పానిష్ చిత్రం “కాంపియోనెస్” యొక్క అధికారిక రీమేక్.

27 జూన్

మనోజ్ విష్ణు నటించిన “కన్నప్ప” చిత్రం విడుదల అవుతుంది. ఇది భక్త కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం భారీ స్థాయి నిర్మాణం మరియు విజువల్స్ కారణంగా చాలా అంచనాలు ఉన్నాయి.

, , , , , , , , ,
You may also like
Latest Posts from