మార్చి 14వ తేదీన విడుదలైన కోర్ట్ చిత్రం ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలసిందే. ఒక చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా పరుగులు పెడుతోంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం కళ్లు చెదిరే కలక్షన్లు సాధించింది. ఏకంగా రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
కేవలం 10 రోజుల్లోనే రికార్డు వసూళ్లను అందుకుంది. ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి నిర్మాతలకు లాభాల పంట పండించింది.
ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.10 కోట్లు అంటే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బంపర్ వసూళ్లను సాధించి షాక్ ఇస్తోంది.
ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికా గడ్డపై $1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో.. రామ్ జగదీష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేశాడు.
ఇందులో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. వారు అదిరిపోయే యాక్టింగ్‌తో సినీ ఆడియన్స్‌ను అలరించారు.
ఇక శివాజీ, రోహిణి, సాయికుమార్, హర్షవర్ధన్, శుభలేక వంటి నటీ నటులు సినిమాకి వెన్నెముఖలా నిలిచారు. మొత్తంగా సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు.