
దీపావళి సెలవుల్లో విడుదలైన ‘కె–ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. కానీ రివ్యూల పరంగా మాత్రం మిక్స్ టాక్ వచ్చింది. చాలామంది విమర్శకులు “కథలో కొత్తదనం లేదు” అని తేల్చేశారు. అయితే దీనిపై హీరో కిరణ్ అబ్బవరం ఘాటుగా స్పందించాడు.
“మా సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెప్పాం. ఇది ఎక్స్‌పెరిమెంటల్ కాదు, కొత్తదనం కోసం కాదు — ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీశాం. అయినా కూడా ‘కొత్తదనం లేదు’ అని వంకలు పెట్టడం సరికాదు. ప్రేక్షకులు ఏం ఆశించాలో ముందే ప్రిపేర్ చేశాం. ఇది ఫన్ ఫిల్మ్,” అని కిరణ్ స్పష్టంగా తెలిపారు.
సినిమా రిలీజ్ తర్వాత ‘కె–ర్యాంప్’ టీం మీడియాతో మాట్లాడింది. “పబ్లిక్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కొందరు సోషల్ మీడియాలో తప్పుదోవపడేలా కామెంట్స్ చేస్తున్నారు,” అని టీం సభ్యులు పేర్కొన్నారు.
నిర్మాత రాజేష్ దండా కూడా పక్షపాత రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ —
“రేటింగ్ ఎంత ఇస్తే అంత ఇస్తారు, కానీ న్యాయం చేయాలి. పెద్ద హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా ఒకే రీతిలో స్పందించాలి. కొందరు సినిమాలకు హడావిడిగా రివ్యూలిస్తారు, ఇంకొన్నింటిని ఫస్ట్ హాఫ్ రివ్యూ వేసి వదిలేస్తారు. ఇది సరికాదు. చిన్న నిర్మాతల సినిమాల్ని తేలిగ్గా తీసుకోవడం బాధాకరం,” అని అన్నారు.
దర్శకుడు జైన్స్ నాని కూడా జోడిస్తూ —
“నా స్నేహితులు రివ్యూలు చూసి ఆశ్చర్యపోయారు. సినిమాలో ఉన్న కంటెంట్‌కి సోషల్ మీడియా కామెంట్స్ కి పొంతనే లేదన్నారు. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించేలా రివ్యూలు రావాలి,” అని కోరారు.
