అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ని తెరపై చూడాలన్న అభిమానుల ఆశలకు మళ్లీ కళ్లెం పడింది. ‘ఘాటీ’ మూవీ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాయిదాల వెనుక అసలైన సమస్య ఏంటి?
ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉన్న నటి అనుష్క శెట్టి సినిమాలు అంటే ఓ రేంజ్ ఆసక్తి. అయితే ఇప్పుడు ఆమె నటిస్తున్న “ఘాటి” సినిమా చుట్టూ వాయిదాల మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరోసారి విడుదల తేదీ మారబోతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏప్రిల్‌లో థియేటర్లకు రావాల్సిన ఈ చిత్రం, తొలుత జూలై 11కు మారింది. అప్పుడే ఫైనల్‌గా అన్న మాటలతో ప్రచారం మొదలైంది. కానీ తాజా సమాచారం మేరకు, మేకర్స్ మరోసారి విడుదల వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా కొంత పనులు పెండింగ్‌లో ఉండటంతో డేట్ మార్చే అవకాశం ఉందట.
ఇక రాబోయే నెలల్లో కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడం కూడా కష్టమేనని ఫిలింనగర్ వర్గాల టాక్. ఇప్పటికే UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలతో, సస్పెన్స్ తో కూడిన మలుపులతో, ఇంటెన్స్ అండ్ లేయర్డ్ కథనంతో తెరకెక్కుతున్న “ఘాటి”పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇంతటి క్రేజ్ ఉన్న అనుష్క సినిమా రిలీజ్ వాయిదా పడుతుండటం కొంచెం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా తెలుగు సినిమాలన్నీ వాయిదాల బాట పడుతున్న వేళ… “ఘాటి” కూడా అదే జాబితాలో చేరడం చర్చనీయాంశమైంది.
ఘాటి విడుదలపై క్లారిటీ వచ్చేవరకూ అభిమానుల ఎదురుచూపులు ఇంకా కొనసాగాల్సిందే.